పవన్ కళ్యాణ్ ఊసరవెల్లి అంటూ కామెంట్ చేసిన ప్రకాష్ రాజ్.. కానీ…  

తెలుగులో పలు చిత్రాలలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఇటీవలే నటుడు  ప్రకాష్ రాజ్ ప్రజలకు సేవ చేయాలనే మంచి ఉద్దేశంతో రాజకీయాల్లోకి  వచ్చి  కర్ణాటక ఎన్నికలలో స్వాతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేశాడు.

TeluguStop.com - Telugu Veteran Actor Prakash Raj Sensational Comments Pawan Kalyan For Ghmc Elections

 కానీ అనుకోకుండా పరాజయంపాలైనప్పటికీ పట్టు విడవకుండా ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉన్నాడు.

అయితే తాజాగా ప్రకాష్ రాజ్ టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో అవుతున్నాయి.

TeluguStop.com - పవన్ కళ్యాణ్ ఊసరవెల్లి అంటూ కామెంట్ చేసిన ప్రకాష్ రాజ్.. కానీ…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

 అయితే ఇంతకీ ఆ వ్యాఖ్యలు ఏమిటంటే ఇటీవలే పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో  జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించి, అనుకోకుండా విరమించుకున్నాడు.దీంతో ఈ విషయంపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ జిహెచ్ఎంసి ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నందుకు తాను ఎంతో నిరుత్సాహానికి గురయ్యానని చెప్పుకొచ్చాడు.

 అంతేగాక సొంత పార్టీ కలిగి ఉన్న సమయంలో ఇతర పార్టీల నిర్ణయాలపై కట్టుబడి ఉండకూడదని గుర్తు చేశాడు.

అంతేగాక ముందు ఎన్నికలలో పోటీ చేస్తానని చెప్పి తర్వాత తప్పుకోవడం వల్ల పలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని పరోక్షంగా చెప్పుకొచ్చారు.

అయితే 2014 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికలలో బీజేపీ వైఖరి గురించి తప్పు పట్టి మళ్లీ ఇప్పుడు వారికి తమ మద్దతు తెలపడంతో పాటు ఏకంగా ఎన్నికల బరిలో నుంచి కూడా తప్పుకోవడం వల్ల ఊసరవెల్లి అని జనాలు అనుకుంటారని అంటూ పరోక్షంగా ఎద్దేవా చేశాడు.

దీంతో ప్రస్తుతం ప్రకాష్ రాజు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ దుమారం రేపుతున్నాయి.అంతేగాక ఈ విషయంపై స్పందించిన కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాలను బట్టి మాత్రమే పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నాడని అంతేతప్ప అందులో ఎలాంటి పార్టీ ప్రయోజనం లేదా డబ్బు ప్రయోజనం వంటివి లేవని కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ప్రకాష్ రాజ్ తెలుగులో ప్రముఖ దర్శకుడు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న “వకీల్ సాబ్” చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నాడు.

 అలాగే కన్నడ ప్రముఖ దర్శకుడు “ప్రశాంత్ నీల్” దర్శకత్వం వహిస్తున్న “కేజిఎఫ్” అనే చిత్రంలో కూడా నటిస్తున్నాడు.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.

#Prakash Raj #TeluguVeteran #HyderabadGHMC #Pawan Kalyan #Janasena Party

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Telugu Veteran Actor Prakash Raj Sensational Comments Pawan Kalyan For Ghmc Elections Related Telugu News,Photos/Pics,Images..