గిరిబాబు : అవును ఆ విషయంలో నాకు చిరుకి మధ్య గొడవ జరిగింది.. కానీ...

తెలుగులో సెంటిమెంటల్, విలన్ తదితర పాత్రలలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సీనియర్ విలక్షణ నటుడు గిరిబాబు గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే.అయితే ప్రస్తుతం గిరిబాబు ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.

 Telugu Veteran Actor Giribabu React About Chiranjeevi Clash Issue,giribabu, Telu-TeluguStop.com

ఆ మధ్య ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో గిరిబాబు పాల్గొన్నాడు. ఇందులో భాగంగా అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి తో జరిగినటువంటి గొడవ గురించి సినీ ప్రేక్షకులతో పంచుకున్నాడు.

అయితే ఇందులో భాగంగా తాను అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించినటువంటి “కొదమ సింహం” అనే చిత్రం డిస్ట్రిబ్యూటర్ హక్కులను కొనుక్కున్నానని కానీ సరిగ్గా అదే సమయంలో కౌబాయ్ అనే చిత్రం విడుదలకాగా ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదని దాంతో ఈ కొదమ సింహం చిత్రాన్ని కొనడానికి బయ్యర్లు ముందుకు రాలేదని దాంతో ఆ విషయంలో మెగాస్టార్ చిరంజీవి తో ఓ చిన్నపాటి గొడవ జరిగిన మాట వాస్తవమేనని కానీ తర్వాత వెంటనే కలిసి పోయామని తెలిపాడు. అంతేగాక సినిమాల్లో, రాజకీయాల్లో గొడవలు చాలా కామన్ అని చిన్న చిన్న  గొడవలు తమ స్నేహ బంధుత్వాలపై పెద్దగా ప్రభావం చూపవని కూడా తెలిపాడు.

అయితే ప్రస్తుతం సినిమాలు తీయడానికి చాలా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ఇందులో ముఖ్యంగా కొత్త టెక్నాలజీలు, గ్రాఫిక్స్, నూతన నటీనటుల పనితీరు, వంటి అంశాలు బాగా కలిసొస్తున్నాయని అభిప్రాయం వ్యక్తం చేసారు. అప్పట్లో తాను 28 లక్షలు పెట్టి సింహ గర్జన అనే చిత్రాన్ని తీశానాని ఆ చిత్రం కోసం దాదాపుగా 600 మంది జూనియర్ ఆర్టిస్టులు, 200 గుర్రాలు కష్టపడి షూటింగ్ చేశామని చెప్పుకొచ్చారు.

 కానీ ఈ కాలంలో గ్రాఫిక్స్ మాయతో 100 మందిని వెయ్యిమంది గా చూపించవచ్చని తెలిపాడు.కాగా ప్రస్తుతం తన కొడుకులు రఘుబాబు, బోస్ బాబు సినిమా పరిశ్రమలో బాగానే రాణిస్తున్నారని దాంతో తన మనవడు నాగరత్న బాబుని సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube