ఈ తెలుగు నటి తమ్ముడు ఒకప్పుడు పెద్ద విలన్ అని మీకు తెలుసా ..?

తెలుగులో ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన “ఓ మగాడు ఆడది” అనే చిత్రం ద్వారా సాఫ్ట్ విలన్ గా సినిమా పరిశ్రమకి పరిచయమైన తెలుగు నటుడు బాలాజీ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఒకప్పుడు బాలాజీ మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, తదితర స్టార్ హీరోల చిత్రాల్లో విలన్ గా నటించి ప్రేక్షకులని బాగానే అలరించారు.

 Telugu Veteran Actor Balaji Real Life News, Balaji,telugu Veteran Actor, Real Li-TeluguStop.com

అయితే తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో బాలాజీ పాల్గొన్నాడు.ఇందులో భాగంగా తన సినీ ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

అయితే అతనికి చిన్నప్పటి నుంచే సినిమాలపై మక్కువ ఎక్కువని అందువల్లనే ఎలాగైనా నటుడు కావాలని సినిమా పరిశ్రమకి వచ్చానని తెలిపారు.ఈ క్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు దాసరి నారాయణరావు దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రానికి ఆడిషన్స్ జరుగుతుంటే అక్కడికి వెళ్లాలని తన మొదటి ప్రయత్నంలోనే ఆ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్నానని చెప్పుకొచ్చాడు.

ఆ తర్వాత మొదట్లో పలు ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ క్రమక్రమంగా తెలుగు, తమిళం, మలయాళం, తదితర భాషలలో బాగానే రాణించాలని తెలిపాడు.

అయితే ఇప్పటి వరకు చాలా మందికి తెలిసిన తెలియని విషయం ఏంటంటే నటుడు బాలాజీ తెలుగులో పలువురు స్టార్ హీరోల కి తల్లి పాత్రలో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోహిణి తమ్ముడు.

కాగా ప్రస్తుతం బాలాజీ పలు తెలుగు సీరియల్ లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నాడు.అలాగే మరో నాలుగు చిత్రాలలో కూడా నటిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube