తెలుగులో హీరో, కమెడియన్ తదితర పాత్రలలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విలక్షణ నటుడు ఆలీ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ప్రస్తుతం ఆలీ ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క పలు ఈవెంట్లు, షోలలో హోస్ట్ గా వ్యవహరిస్తూ బాగానే రాణిస్తున్నాడు.
మొదట్లో ఎలాంటి సినీ కుటుంబ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమకు వచ్చి ఆలీ చాల కష్టాలు పడిన తర్వాత స్టార్డమ్ ని సంపాదించి బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు.
అయితే తాజాగా కమెడియన్ ఆలీ కి సంబంధించినటువంటి ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతుంది.
అయితే ఆ ఫోటోని ఒకసారి పరిశీలించినట్లయితే చిన్నప్పుడు ప్రముఖ దర్శకుడు భారతీరాజా దర్శకత్వం వహించిన సీతాకోక చిలుక చిత్రంలో ఆలీ నటిస్తున్న సమయంలో తీసినట్లు తెలుస్తోంది. దీంతో కొందరు ఆలీ అభిమానులు “ఆలీ చిన్నప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడని” అంటూ కామెంట్లు చేస్తున్నాడు.
అయితే ఆలీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, తదితర భాషలలో కలిపి దాదాపుగా 300 కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించాడు. అంతేకాకుండా 45కి పైగా చిత్రాలలో హీరోగా నటించాడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఆలీ తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి ఈటీవీలో “ఆలీతో సరదాగా” అనే షోలో యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు.అలాగే చిన్న బడ్జెట్ తరహా చిత్రమైన మా గంగా నది అనే చిత్రంలో హీరో గ నటిస్తున్నాడు.
ఇటీవలే ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ విడుదలకాగా మంచి స్పందన లభించింది. అంతేకాక టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్నటువంటి చిత్రంలో కూడా కమెడియన్ గా నటిస్తున్నాడు.