బెదిరింపు కేసులో ఇరుక్కున్న తెలుగు టీవీ యాంకర్ !     2018-10-28   07:38:59  IST  Sai Mallula

టీవీ యాంకర్‌ రవి దాడికి పాల్పడ్డాడంటూ ఓ సినీ డిస్ట్రిబ్యూటర్‌ పోలీసులను ఆశ్రయించారు. తనబాకీ తీర్చాలంటూ యాంకర్‌ రవి తన అనుచరులతో వచ్చి తనను బెదిరించాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.డిస్ట్రిబ్యూటర్‌ సందీప్‌తో యాంకర్‌ రవికి ఆర్థికపరమైన లావాదేవీలున్నాయి.

Telugu TV Anchor Ravi Stuck In Case-

Telugu TV Anchor Ravi Stuck In Case

తీసుకున్న బాకీని సందీప్‌ చెల్లించకపోవడంతో రవి కోపోద్రిక్తుడయ్యాడు. అప్పు తీర్చకుంటే అంతు చూస్తానంటూ తన అనుచరులతో వచ్చి బెదిరించాడని సందీప్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రవిని విచారించారు. అవసరమైతే విచారణకు మళ్లీ పిలుస్తామని చెప్పి యాంకర్‌ రవిని వదిలిపెట్టారు పోలీసులు.