కారు ప్రమాదం లో టీవి నటుల హఠాన్మరణం  

Mutyala Muggu Actress-

కారు ప్రమాదం లో ఇద్దరు టీవి నటుల హఠాన్మరణం వారి కుటుంబం లో తీవ్ర విషాదం నింపింది. అనూష రెడ్డి (21) , భార్గవి (20)అనే నటీమణులు చనిపోయారు . ఈ సంఘటన తెల్లవారుజామున షూటింగ్ పూర్తి చేసుకొని తిరిగి వస్తున్నా సమయం లో మొయినా బాద్ మండలం అప్పారెడ్డి గూడ బస్టాండ్ సమీపం లో ఎదురుగా వస్తున్న లారీ ని తప్పించబోయి చెట్టుకి ఢీకొనడం తో జరిగింది.ముందు కూర్చున్న భార్గవి అక్కడి కక్కడే చనిపోగా అనూష రెడ్డి ని ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మరణించింది..

కారు ప్రమాదం లో టీవి నటుల హఠాన్మరణం-Mutyala Muggu Actress