టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య..! ఆ సెల్ఫీ వీడియోలో ఏముంది.? అనుమానాలు ఇవే.!  

  • వర్ధమాన టీవీ నటి సువ్వాడ నాగ ఝాన్సీ (21) మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌ అమీర్‌పేటలోని సాయి అపార్ట్‌మెంట్‌లోని తన ఫ్లాట్‌లో ఫ్యానుకు చీరతో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఝాన్సీ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  • ‘స్టార్ మా’ ఛాన‌ల్‌లో ప్రసారమయ్యే ‘పవిత్ర బంధం’ సీరియల్‌లో ఝాన్సీ ఓ ప్రధాన పాత్రలో నటిస్తోంది. కొంతకాలంగా ఒక అబ్బాయితో ఝాన్సీ ప్రేమలో ఉందని, ఇటీవల ప్రియుడితో ఆమెకు తరచూ గొడవలు జరుగుతున్నాయని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

  • Telugu TV Actress Naga Jhansi Committed Suicide In Hyderabad-Pavitra Bandham Serial Artist Selfie Video Surya Teja

    Telugu TV Actress Naga Jhansi Committed Suicide In Hyderabad

  • ఏడాది క్రితం ఝాన్సీకి విజయవాడకు చెందిన సూర్యతేజతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆరు నెలల క్రితం ఝాన్సీ ఇంట్లో ప్రేమ విషయం చెప్పడంతో వారు కూడా ఒప్పుకున్నారు. అయితే రెండు నెలలుగా ఝాన్సీపై సూర్య అనుమానం వ్యక్తం చేస్తూ తీవ్ర వేధింపులకు గురిచేస్తూ వచ్చాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అతని వేధింపుల వల్లే ఝాన్సీ నటన ఆపేసి నెల క్రితం ఓ స్నేహితురాలితో కలసి అమీర్‌పేటలో ఓ బ్యూటీపార్లర్‌ నిర్వహిస్తోందని తెలిపారు.

  • మృతురాలి పడక గదిలో రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం. వాటిలోనే సమాచారాన్ని విశ్లేషించి సూర్య వేధించిట్టు తేలిన పక్షంలో అతనిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం’ అని ఏసీపీ విజయ్‌కుమార్‌ తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు చెప్పారు.

  • Telugu TV Actress Naga Jhansi Committed Suicide In Hyderabad-Pavitra Bandham Serial Artist Selfie Video Surya Teja
  • ఆత్మహత్యకు గల కారణాలపై బుల్లితెర నటి ఝాన్సీ సెల్ఫీ వీడియో తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంలో సెల్ఫీ వీడియో కీలకంగా మారింది. అందులో ఏముందో తెలిస్తే ఝాన్సీ ఆత్మహత్యకు గల కారణాలు తెలిసే అవకాశముంది. అయితే ఈ వీడియో విషయంలో పోలీసులు గోప్యత పాటిస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఝాన్సీ ప్రేమ వ్యవహారంపై బంధువులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె ప్రేమ విషయం తెలియదని కొందరు అంటుంటే, మరికొందరు ఆమె ప్రేమించిన మాట వాస్తవమేనని చెబుతున్నారు.