థియేటర్లు ఓపెన్‌ అయ్యే టైమ్‌ కు కరోనా థర్డ్‌ వేవ్‌..!

దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా గత ఏడాదిన్నర కాలంగా థియేటర్లు మూత పడే ఉన్నాయి.మద్యలో రెండు మూడు నెలలు కొన్ని రాష్ట్రాల్లో ఓపెన్‌ అయినా సెకండ్ వేవ్ కారనంగా మళ్లీ మూత పడ్డాయి.

 Telugu States Theaters Open In Very Soon, News In Telugu, Tollywood, Theaters Op-TeluguStop.com

దేశంలో ఎక్కడ చూసినా ప్రస్తుతానికి థియేటర్లు మూత పడే ఉన్నాయి.కనుక సినిమా ప్రేక్షకులు మెల్ల మెల్లగా థియేటర్లను మర్చిపోయే పరిస్థితి కనిపిస్తుంది.

ఇప్పటికే ప్రేక్షకులు ఓటీటీ దారి పట్టారు.ఓటీటీలో పెద్ద ఎత్తున సినిమా లు విడుదల అవుతున్నాయి.

దాంతో ప్రేక్షకులు పూర్తిగా ఓటీటీ కే వెళ్తున్నారు.ఇక థియేటర్ల ఓపెన్‌ విషయమై రాష్ట్రాలు ప్రభుత్వాల నుండి ఎక్కువగా వ్యతిరేకత లేదు.

అయినా కూడా థియేటర్ల యాజమాన్యాలు ఓపెన్‌ చేసేందుకు మొగ్గు చూపడం లేదు.ప్రస్తుతం కరోనా భయం మరియు కొత్త వేరియంట్ భయం కారణంగా థియేటర్లు ఓపెన్‌ చేసినా వస్తారనే నమ్మకం లేదు.

అందుకే థియేటర్ల ను ఓపెన్‌ చేయాలంటే ఆర్థిక భారం తప్ప మరోటి లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.థియేటర్లలో కొత్తగా తీసుకు వస్తున్న పాలసీల కారణంగా కూడా ఇప్పట్లో ఓపెన్‌ చేస్తే ఆదాయం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

Telugu Corona Effect, Corona Wave, July, Corona, Telugu, Theaters, Tollywood-Mov

ఆగస్టు వరకు థియేటర్లను మెల్లగా ఓపెన్‌ చేద్దామని కొందరు భావిస్తున్నారు.టాలీవుడ్ నిర్మాతల విషయానికి వస్తే థియేటర్ల విషయంలో వారు అస్సలు ఆసక్తిని కనబర్చుతున్నట్లుగా లేరు.జులై నెలలో థియేటర్లు ఓపెన్‌ అవుతాయా అంటే డౌటే అన్నట్లుగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.దేశ వ్యాప్తంగా ఉన్న థియేటర్ల విషయం ఏమో కాని తెలుగు రాష్ట్రాల థియేటర్లు మాత్రం ఆగస్టు చివరి వరకు పూర్తి స్థాయిలో ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Telugu Corona Effect, Corona Wave, July, Corona, Telugu, Theaters, Tollywood-Mov

థియేటర్లు ఓపెన్‌ అయిన వెంటనే పెద్ద సినిమాలు ఖచ్చితంగా వచ్చేందుకు సిద్దం అవ్వవు.కనీసం నెల రోజుల సమయం పడుతుంది.ఆ నెల రోజులు అంటే సెప్టెంబర్‌ వరకు పెద్ద సినిమాల వాయిదా తప్పదని అంటున్నారు.పెద్ద సినిమాలు విడుదల అనుకునేప్పటి వరకు మళ్లీ కరోనా విజృంభించి థర్డ్‌ వేవ్‌ అంటారేమో అంటూ ఆందోళన వ్యక్తం అవుతోంది.

పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతున్న ఆ సమయంలో మళ్లీ థియేటర్లు మూత పడతాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube