గత కొంతకాలంగా … హీరో విశాల్ కు తమిళ నిర్మాత మండలికి మధ్యే ఏర్పడిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది.అయితే ఈ విబేధాలు మరింత ముదురు చివరకు .
హీరో అరెస్ట్ వరకు దారితీసాయి.దీంతో … గురువారం నిర్మాతల మండలి ఎదుట ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికైన విశాల్‌ను తొలుత అభినందించిన వాళ్లే ఇప్పుడు విమర్శిస్తున్నారు.సమస్యలను పట్టించుకోవడం లేదని.పైరసీని అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పైరసీ సినిమాల వెబ్సైట్ తమిళ్‌రాకర్స్‌లో విశాల్‌కు షేర్ ఉందంటూ ప్రముఖ నిర్మాత అజగప్పన్ ఆరోపించారు.ఇక మీదట నిర్మాతల మండలిలోకి రానిచ్చేది లేదంటూ ఆయన ప్రత్యర్థులు కొందరు కార్యాలయానికి తాళం వేశారు.దాంతో విశాల్ తాళం పగలగొట్టి లోనికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు.
ఈ నేపథ్యంలో తమిళ నిర్మాతల మండలి కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.చివరకు చెన్నై పోలీసలు విశాల్‌ను అరెస్ట్ చేశారు.