ఈ హీరోయిన్ కి ఎన్టీఆర్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందట... కానీ అలా జరగడంతో....

సినిమా పరిశ్రమకు హీరో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వగానే మంచి ఫేమ్ మరియు క్రేజీ సంపాదించుకుని ఉన్నట్టుండి ఒక్క సినిమాతోనే తళుక్కున మెరిసి తెరమరుగైన నటీనటులు చాలామంది సినిమా పరిశ్రమలో ఉన్నారు.కాగా ఇందులో తెలుగులో ప్రముఖ హీరో శివాజీ హీరోగా నటించిన “తాజ్ మహల్” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన శృతి కూడా ఈ కోవకే చెందుతుంది.

 Telugu Taj Mahal Movie Fame Sruthi Got Chance In Ntr Movie But-TeluguStop.com

కాగా శృతి రాజు వచ్చీరావడంతోనే తన నటనతో ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది దీనికితోడు తాజ్ మహల్ చిత్రం కూడా పర్వాలేదనిపించడంతో ఈ అమ్మడికి క్రేజ్ బాగానే వచ్చింది.కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో గాని శృతి మళ్లీ తెలుగు చిత్రాలలో నటించడం లేదు.

అయితే నటి శృతి దేశ ఆర్థిక రాజధాని ముంబై నగర పరిసర ప్రాంతంలో పుట్టి పెరిగింది.స్థానికంగా ఉన్నటువంటి జైన్ కాలేజ్ లో మాస్ మీడియాలో అడ్వర్టైజింగ్ డిగ్రీని పూర్తి చేసింది.

 Telugu Taj Mahal Movie Fame Sruthi Got Chance In Ntr Movie But-ఈ హీరోయిన్ కి ఎన్టీఆర్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందట… కానీ అలా జరగడంతో….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ తర్వాత సినిమాలపై ఆసక్తి కలగడంతో అవకాశాల కోసం సినిమా ఇండస్ట్రీకి వచ్చింది.అయితే ఆ మధ్య ప్రముఖ యూట్యూబ్ చానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో శృతి పాల్గొని పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.

ఇందులో భాగంగా తనకి మొదట్లో తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చిందని కానీ పలు అనివార్య కారణాల వల్ల తాను హీరోగా నటించే లేక పోయానని తెలిపింది.అంతేకాకుండా నాగ చైతన్య హీరోగా నటించిన జోష్ చిత్రంలో కూడా తనకి హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చిందని కానీ పలు వ్యక్తిగత కారణాల వల్ల ఈ చిత్రంలో కూడా నటించలేక పోయానని తెలిపింది.

చివరికి తాజ్ మహల్ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చినప్పటికీ తనకు పెద్దగా గుర్తింపు లభించలేదని తన అభిప్రాయం తెలిపింది.

అయితే తన చదువు పూర్తయిన తర్వాత అడ్వర్టైజింగ్ రంగంలో రాణించాలని ఉండేదని కానీ అనుకోకుండా సినిమా పరిశ్రమ వైపు వచ్చానని చెప్పుకొచ్చింది.అయితే కాజల్ మహల్ చిత్రంలో నటించిన తర్వాత ఒకటి, రెండు చిత్రాలలో హీరోయిన్ గా నటించే అవకాశాలు వచ్చినప్పటికీ ఆ చిత్రాలు ఇప్పటికీ విడుదల కాలేదు.దీంతో ప్రస్తుతం శృతి ఎక్కడ ఉంది.? ఏం చేస్తుంది.? అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

#TajMahal #TeluguTaj #Naga Chaitanya #Josh #Sivaji

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు