నటి ప్రగతి : 20 ఏళ్లకే పెళ్లి చేసుకుని  తప్పు చేశా... కానీ ఇప్పుడు...

Artist Pragathi About Her Marriage, Pragathi, Telugu Supporting Artist, Sensational Comments, Marriage Life, Tollywood

పలు టాలీవుడ్ తెలుగు చిత్రాలలో హీరోలకు తల్లిగా నటించి తన సెంటిమెంట్ మరియు ఎమోషనల్ పాత్రలతో ప్రేక్షకుల్ని బాగానే అలరించినటువంటి క్యారెక్టర్  ఆర్టిస్ట్ ప్రగతి గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.అయితే తాజాగా నటి ప్రగతి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని ఇందులో భాగంగా తన జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల గురించి ప్రేక్షకులతో పంచుకుంది.

 Artist Pragathi About Her Marriage, Pragathi, Telugu Supporting Artist, Sensati-TeluguStop.com

అయితే  ఈ క్రమంలో తన జీవితంలో తాను చేసినటువంటి చెత్త పని ఏదైనా ఉందంటే అది పెళ్లి చేసుకోవడమే అని సంచలన వ్యాఖ్యలు చేసింది.అంతేగాక తాను పెళ్లి కాకముందు పోలీస్ కావాలని అనుకున్నప్పటికీ తన కుటుంబ పరిస్థితులు మరియు తాను చదివిన చదువుల కారణంగా కాలేకపోయానని చెప్పుకొచ్చింది.

అతి పిన్న వయసులో పెళ్లి చేసుకోవడంతో తనకు పెళ్లి చేసుకున్న తర్వాత ఎదుర్కున్న సంఘటనలే తాను సినిమా పరిశ్రమలో నటిగా ఎదగడానికి కారణమయ్యాయని తెలిపింది.

దీంతో పెళ్లిపై నటన నటి ప్రగతి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెలుగు వైరల్ అవుతున్నాయి.

  అయితే ఈ విషయం పై స్పందించిన కొందరు నెటిజన్లు పెళ్లి అనేది మహిళ జీవితంలో ఎంతో కీలక ఘట్టం అని కాబట్టి తమ జీవిత భాగస్వామిని ఎన్నుకునే సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే జీవితాంతం కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల నటి ప్రగతి టాలీవుడ్ సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఓ సమస్య పై స్పందించింది.

 ఇందులో భాగంగా  ఈ మధ్య కాలంలో కొందరు దర్శక నిర్మాతలు నటీనటుల అంద చందాలను చూసి అవకాశాలు వస్తున్నారని నటనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శలు చేసింది.కాగా ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ విధించడంతో సినిమా షూటింగులు లేక ఇంటి వద్దనే ప్రగతి ఖాళీగా ఉంటోంది.

 ఈ క్రమంలో తన ఆరోగ్యం ఫిట్ నెస్ ని మెరుగుపరుచుకునేందుకు యోగా వ్యాయామం వంటివి చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube