అగ్రరాజ్యంలో సత్తాచాటిన తెలుగు విద్యార్థి..!

ఏ రంగంలోనైనా టాలెంట్ ఉంటే చాలు.అవకాశాలు వాటంతట అవే మనదగ్గరికి వస్తాయి.

 Telugu Student Empowered In The Superpower, American Girl, Usa, Hyderabad, 2 Cro-TeluguStop.com

టాలెంట్ ను నిరూపించుకుంటే ఎంత గొప్ప స్థాయికైనా మనం ఎదగగలం.అందుకోసం చాలా హార్డ్ వర్క్ చేయాలి.

కృషి, పట్టుదలతో అనుకున్నది సాధించాలి.మన తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలా మంది ప్రపంచవ్యాప్తంగా చాలా రంగాల్లో రాణిస్తూ తమదైన ముద్ర వేస్తున్నారు.

తాజాగా ప్రాంగణ నియామకాల్లో హైదరాబాద్‌కు చెందిన దీప్తి అనే యువతి సత్తా చాటింది.అమెరికాలోని ఓ ప్రముఖ కంపెనీలో భారీ వేతనంతో ఉద్యోగం దక్కించుకుంది.సియాటెల్‌లో వున్న మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో రూ.2 కోట్ల వార్షిక వేతనంతో దీప్తి సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్‌ గా జాబ్ సంపాదించింది.

దీప్తి యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో ఈ నెల 2న ఎంఎస్ (కంప్యూటర్స్) పూర్తి చేసింది.క్యాంపస్ ఇంటర్యూలో ఈ ఉద్యోగాన్ని దక్కించుకుంది.ఈరోజు(మే 17) ఆమె ఉద్యోగ బాధ్యతలు చేపట్టనున్నారు.కాగా.

దీప్తి తండ్రి వెంకన్న హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌ లో క్లూస్‌ టీం విభాగం అధిపతిగా పని చేస్తున్నారు.దీప్తి బీటెక్ పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్‌ లోని ఓ కంపెనీలో మూడేళ్ల పాటు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ గా జాబ్ చేసింది.

అనంతరం ఆ ఉద్యోగానికి రాజీనామా చేసింది.ఎంఎస్ చదివేందుకు అమెరికాకు వెళ్లి.

ఫ్లోరిడా యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించింది.ఇటీవల అక్కడ జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో మొత్తం 300 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపిక కాగా వారందరిలో దీప్తికి అత్యధిక వేతనం లభించడం విశేషం.

హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లి అక్కడ అత్యధిక వేతనంతో ఉద్యోగం సంపాదించడం మామూలు విషయం కాదు.దీప్తి ఇప్పుడు చాలా మంది విద్యార్థులకు ఇన్స్పిరేషన్ గా నిలుస్తోంది.

నైపుణ్యం ఉంటే అవకాశాలు దక్కించుకోవచ్చు అని దీప్తి నిరూపించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube