అమెరికా లో జరిగిన ప్రమాదం లో మరో తెలుగు విద్యార్థి మృతి       2018-06-14   01:42:54  IST  Bhanu C

గడిచిన రెండు నెలల కాలంలో అమెరికాలో జరుగుతున్న వరుస ప్రమాదాలు భారత ఎన్నారైల ని బలితీసుకుంటున్నాయి చాలా మంది తమతమ తప్పిదాల వలన ప్రమాదాల కి గురవ్వుతుంటే మరి కొంతమంది అనుకోకుండా జరుగుతున్నప్రమాదాల వలన ప్రాణాలు కోల్పోతున్నారు..ఇప్పటికి దాదాపు ఒక నెల కాలంలోనే నలుగురు తెలుగు విద్యార్థులు బలికాగా మంగళవారం జరిగిన రైలు ప్రమాదంలో మరొక తెలుగు విద్యార్థి బలై పోయాడు…ఈ సంఘటన ఎన్నారైలని కలిచి వేసింది..వివరాలలోకి వెళ్తే..

అమెరికాలోని టెక్సాస్‌ లో జరిగిన రైలు ప్రమాదంలో ప్రకాశం జిల్లా పామూరు పట్టణంలోని మోడ్రన్‌ రెసిడెన్సీ, మోడ్రన్‌ కేఫ్‌ హోటల్‌ నిర్వాహకుడైన దుగ్గినేని వెంకట్రావు, రమాదేవిల ఏకైక కుమారుడు అయిన దీపక్‌ మృతి చెందినాడు..దీపక్ అమెరికాలోనే ఎంఎస్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం ఉద్యోగ కోసం వేచి చూస్తున్నారు. టెక్సా్‌సలోని డీమోంట్‌లో నివాసం ఉంటున్న దీపక్‌ స్నేహితుడిని రైలు ఎక్కించేందుకు స్టేషన్‌కు వెళ్లారు.

అయితే ఇదే సమయంలో దీపక్ఈ రైలు వస్తున్నవిషయం చూసుకోలేడు ఒక్కసారిగా రైలు బలంగా తగలడంతో దీపక్ అక్కడికక్కడే మరణించాడు..సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నేరు అవుతున్నారు..భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో చూడాలనుకున్న తమ కుమారుడు అర్ధాంతరంగా తనువు చాలించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. దీపక్‌ మృతదేహాన్ని స్వస్థలానికి రప్పించేందుకు బంధువులు ప్రయత్నిస్తుస్తున్నారు…అయితే గతంలో ఒక రెడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదం జరిగిందని అయితే ఆసమయంలో దీపక్ తప్పించుకున్నా మరొక స్నేహితుడు మరణించాడని అతడి స్నేహితులు తెలిపారు..మళ్ళీ ఇలా జరగడం ఎంతో దారుణం అని వారు తమ భాదని వ్యక్తం చేస్తున్నారు.