గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంప్రెస్ చేయబోయి సింహాల చేతిలో హతమైన జూకీపర్.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

ఉజ్బెకిస్తాన్‌లోని పార్కెంట్ ( Parkent In Uzbekistan )నగరంలో ఉన్న ఓ ప్రైవేట్ జూలో భయంకరమైన సంఘటన జరిగింది.

44 ఏళ్ల ఎఫ్.ఇరిస్కులోవ్ ( F.

Iriskulov )అనే జూకీపర్ తన ప్రియురాలిని ఇంప్రెస్ చేసే ప్రయత్నంలో సింహాల దాడిలో దారుణంగా ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరూ షాక్‌కు గురవుతున్నారు.

అసలేం జరిగిందంటే.ఇరిస్కులోవ్ రాత్రి షిఫ్ట్‌లో ఉండగా తెల్లవారుజామున 5 గంటల సమయంలో సింహాల ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లాడు.

సింహాలకు ఎంత దగ్గరగా వెళ్లగలడో వీడియో తీసి తన ప్రియురాలికి పంపించి ఆమెను ఆకట్టుకోవాలనుకున్నాడు.

వీడియోలో అతను ఎన్‌క్లోజర్ తాళం తీసి లోపలికి వెళ్లడం స్పష్టంగా కనిపిస్తుంది.మొదట్లో సింహాలు ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించాయి.

అతను ఒక సింహాన్ని "సింబా" అని పిలుస్తూ సైలెంట్‌గా ఉండమని చెప్పాడు.ఆ తర్వాత కెమెరాను తనవైపుకు తిప్పి నవ్వుతూ కనిపించాడు.

"""/" / అతను మరింత ధైర్యం ప్రదర్శిస్తూ ఒక సింహాన్ని తాకాడు.వాటితో తనకు మంచి పరిచయం ఉందని చూపించాలనుకున్నాడు.

కానీ, ఊహించని విధంగా క్షణాల్లోనే సీన్ మారిపోయింది.సింహాలు ఒక్కసారిగా అతనిపై దాడి చేశాయి.

సింహాలు( Lions ) తనపై దాడి చేస్తుండగా అతను భయంతో కేకలు వేయడం వీడియోలో స్పష్టంగా వినొచ్చు.

ఆ తర్వాత వీడియో బ్లాక్ అయిపోతుంది.రష్యన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సింహాలు అతని ముఖాన్ని తీవ్రంగా గాయపరిచాయి.

అతన్ని చంపి, శరీరాన్ని పాక్షికంగా తినేశాయి. """/" / ఈ దాడి జరిగిన వెంటనే రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.

ఒక సింహాన్ని కాల్చి చంపగా, మిగిలిన రెండు సింహాలకు మత్తు మందు ఇచ్చి బోనులోకి తరలించారు.

ఈ ఘటనలో ఇతరులకు ఎలాంటి హాని జరగలేదని అధికారులు తెలిపారు.ఈ ఘటనపై జూ యాజమాన్యం ఇంకా స్పందించలేదు.

ఈ వీడియో మాత్రం జూకీపర్ల భద్రత, వన్యప్రాణులను ఎలా సంరక్షించాలి అనే అంశాలపై తీవ్ర చర్చకు దారితీసింది.

మోక్షజ్ఞ ఎంట్రీకి ఈ సంవత్సరంలో అయిన మోక్షం లభిస్తుందా..?