Zomato Agent UPSC Preparation : ట్రాఫిక్ లోనూ యూపీఎస్సీ పాఠాలు వింటున్న జొమాటో ఏజెంట్.. దేశానికి ఇలాంటోళ్లే కావాలంటూ?

యూపీఎస్సీ పరీక్షలకు( UPSC Exams ) ప్రిపేర్ అవుతున్న వాళ్ల సంఖ్య లక్షల్లో ఉంటుంది.

అయితే వందల సంఖ్యలో అభ్యర్థులు మాత్రమే యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధిస్తారు.యూపీఎస్సీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న జొమాటో ఏజెంట్( Zomato Agent ) స్టోరీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన సమయంలో టైమ్ వేస్ట్ కాకుండా జొమాటో డెలివరీ బాయ్ చదువుకోవడాన్ని నెటిజన్లు ఎంతగానో ప్రశంసిస్తున్నారు.

గతంలో సీఏగా పని చేసి ప్రస్తుతం యూపీఎస్సీ అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్న ఆయుష్( Ayussh ) అనే వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

జొమాటో డెలివరీ బాయ్ చదువుపై ఇష్టంతో పడుతున్న కష్టాన్ని చూసి దేశానికి ఇలాంటోళ్లే కావాలంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

ఆయుష్ చేసిన ట్విట్టర్ పోస్ట్ కు 1500కు పైగా లైక్స్ వచ్చాయి. """/" / ఆ జొమాటో డెలివరీ ఏజెంట్ వివరాలు తెలియాల్సి ఉంది.

కష్టపడే ఇలాంటి విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేస్తే ఉన్నత లక్ష్యాలను సులువుగా సాధించే అవకాశాలు అయితే ఉంటాయి.

ఈ డెలివరీ ఏజెంట్ రాబోయే రోజుల్లో సులువుగా లక్ష్యాన్ని సాధించాలని ఆశిద్దాం.ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆ ఏజెంట్ ఈ విధంగా డెలివరీ బాయ్ గా గడుపుతున్నాడని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

"""/" / కష్టపడి చదివే వాళ్లకు ప్రత్యేకంగా స్పూర్తి నింపాల్సిన అవసరం లేదని మరి కొందరు వెల్లడిస్తున్నారు.

అతి త్వరలో ఆ జొమాటో ఏజెంట్ వివరాలు కూడా తెలిసే ఛాన్స్ అయితే ఉంది.

ఆ జొమాటో ఏజెంట్ కు కొంతమంది నెటిజన్లు ఆల్ ది బెస్ట్ చెబుతుండటం గమనార్హం.

గతంలో కొంతమంది డెలివరీ బాయ్స్( Delivery Boys ) లక్ష్యాలను సాధించి ప్రభుత్వ ఉద్యోగాలు ( Government Jobs ) సాధించిన సందర్భాలు సైతం ఉన్నాయనే సంగతి తెలిసిందే.

అయితే ట్రాఫిక్ లో ప్రిపేర్ కావడం సేఫ్ కాదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

వైరల్ వీడియో: చీర కట్టి దివ్యంగుల నిరసన.. ఎందుకంటే?