జింబాబ్వే ఆటగాడు టి20 క్రికెట్ లో చరిత్ర సృష్టించాడా..

టి20 ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్లు ఎప్పుడు జరిగినా ఈ మెగా టోర్నమెంట్ కు చిన్న దేశాలు వచ్చి సంచలనాలు సృష్టిస్తూ ఉంటాయి.

క్రికెట్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆ చిన్న దేశాలు టెస్ట్ సభ్యత్వం ఉన్న పెద్ద దేశాలపై విజయం సాధిస్తే అవి సంచలనంగా మారుతూ ఉంటాయి.

ఎందుకంటే పెద్ద జట్లపై చిన్న క్రికెట్ జట్లు విజయం సాధించాలంటే అంత ఆషామాషీ విషయం ఏమీ కాదు.

ఎంతో కష్టపడితే కానీ వారు విజయం సాధించలేరు.అలాంటిది ఆస్ట్రేలియాలో జరుగుతున్న టి20 ప్రపంచ కప్ 2022 లో పాకిస్తాన్ పై జింబాబ్వే అద్భుత పోరాటంతో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.

ఈ జింబాబ్వే విజయంలో కీలక పాత్ర పోషించి ఆటగాడు సికిందర్ రజా రికార్డు సృష్టించాడు.

ఒక్క సంవత్సరంలోని అంతర్జాతీయ టి20 లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెల్చుకున్న ఆటగాడిగా సికిందర్ రజా నిలిచాడు.

ఈ సంవత్సరం మొత్తం 7 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు.

ఈ జాబితాలో మన టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు.

2016లో టి20 అంతర్జాతీయ మ్యాచ్లలో విరాట్ కోహ్లీ ఆరు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకున్నాడు.

2021లో ఉగాండా బౌలర్ దినేష్ నక్రానీ ఆరు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లను అందుకుని మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

"""/"/ అయితే క్రికెట్లో ఏ జట్టును తక్కువ అంచనా వేయకూడదని పాకిస్తాన్ టీంకు గుణపాఠం చెప్పింది జింబాబ్వే జట్టు.

ప్రపంచ నెంబర్ 1 బ్యాటర్ రిజ్వాన్, పరుగుల వరద పారించే బాబర్ ఆజమ్ ఉన్న పాకిస్థాన్ జట్టును జింబాబ్వే జట్టు కోలుకోలేని దెబ్బ కొట్టింది.

అంతకుముందు ఐర్లాండ్ జట్టు కూడా ఇంగ్లండ్‌ను ఓడించింది.ఇప్పటివరకు రెండు సంచలన విజయాలు నమోదైన ఈ ప్రపంచకప్‌లో మెగా టోర్నీ ముగిసేలోపు ఇంకెన్ని సంచలనాలు నమోదవుతాయో వేచి చూడాల్సిందే.

నామినేటెడ్ పదవుల భర్తీ లో చంద్రబాబు తాజా నిర్ణయం ఏంటి ?