టెస్లా కార్లకు ఏమైంది.. అమ్మకాలు పడిపోయాయా? ఈ ఆఫర్లు చూస్తే షాకవుతారు!
TeluguStop.com
ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా టెస్లా కార్ల అమ్మకాలు( Tesla Cars Sales ) ఒక్కసారిగా పడిపోవడంతో కంపెనీకి దిమ్మతిరిగిపోయింది.
కస్టమర్లను మళ్లీ అట్రాక్ట్ చేసేందుకు టెస్లా అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది.మోడల్‌ను బట్టి ఆఫర్లు వేర్వేరుగా ఉన్నాయి.
జర్మనీలో అమ్మకాలు ఏకంగా 76% పడిపోయాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.నెదర్లాండ్స్‌లో 24%, స్వీడన్‌లో 42% అమ్మకాలు డౌన్ అయ్యాయి.
నార్వే, డెన్మార్క్‌లో 48%, ఫ్రాన్స్‌లో 45%, ఇటలీలో 55%, స్పెయిన్‌లో 10%, పోర్చుగల్‌లో 53% చొప్పున అమ్మకాలు పడిపోయాయి.
యూరప్ ఒక్కటే కాదు, ఆస్ట్రేలియాలో కూడా టెస్లా రిజిస్ట్రేషన్లు 66% తగ్గాయి.చైనాలో అయితే సొంత కార్లే పోటీ ఇవ్వడంతో అమ్మకాలు 49% పడిపోయాయి.
ఇదంతా ఒక ఎత్తైతే, టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్( Elon Musk ) వ్యవహార శైలిపై విమర్శలు రావడంతో కొంతమంది సెలబ్రిటీలు కూడా టెస్లా కార్లను వదిలించుకుంటున్నారట.
ఇంకొందరు ఓనర్లు అయితే "ఎలాన్ ఇంత పిచ్చోడని తెలియక ముందే కొన్నాం" అంటూ కార్లపై స్టిక్కర్లు వేసుకుంటున్నారు.
మరీ దారుణం ఏంటంటే కొందరు ఏకంగా టెస్లా కార్లను తగలబెట్టడం లేదా డీలర్‌షిప్‌లపై దాడులు చేయడం వంటి ఘటనలు కూడా జరుగుతున్నాయి.
"""/" /
అమ్మకాలు పెంచుకునేందుకు టెస్లా ఊహించని ఆఫర్లను తీసుకొచ్చింది.సైబర్‌ట్రక్‌లను( Cybertruck ) ఎవరూ కొనడం లేదట.
అందుకే టెస్లా ఫైనాన్స్ ద్వారా లోన్ తీసుకుంటే 1.99% వడ్డీ రేటుకే ఇస్తున్నారు.
అలాగే కారు ఉన్నంత కాలం టెస్లా సూపర్‌ఛార్జర్లను ఫ్రీగా వాడుకోవచ్చనే ఆఫర్ ఇస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా టెస్లాకు 60,000కు పైగా సూపర్‌ఛార్జర్లు ఉన్నాయి.వీటి ద్వారా 15 నిమిషాల్లో 200 మైళ్ల రేంజ్ ఛార్జింగ్ చేసుకోవచ్చు.
"""/" /
మరోవైపు కొత్త మోడల్ 3 కొనేవాళ్లు 7,500 డాలర్ల ఫెడరల్ ట్యాక్స్ క్రెడిట్ కోసం అప్లై చేసుకుంటే 0% వడ్డీతో లోన్ ఇస్తారు.
కానీ క్రెడిట్ స్కోర్ 700 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.ట్యాక్స్ బెనిఫిట్ వద్దనుకునే వాళ్లకు కూడా 0.
99% వడ్డీకే లోన్ ఇస్తున్నారు.ఇలాంటి ఆఫర్లతో టెస్లా ఉన్న కస్టమర్లను నిలబెట్టుకోవాలని, కొత్త కస్టమర్లను ఆకర్షించాలని చూస్తోంది.
మరి ఈ ఆఫర్లు ఎంతవరకు పనిచేస్తాయో చూడాలి.