పుతిన్ అధికారం క్రమంగా క్షీణిస్తోందంటున్న జెలెన్‌స్కీ!
TeluguStop.com
పుతిన్( Putin ) అధికారం మెల్లమెల్లగా క్షీణిస్తోందని జెలెన్‌స్కీ ( Zelensky )తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
వాగ్నర్ దళం పట్ల పుతిన్ రియాక్షన్ చేస్తేనే పుతిన్ సత్తా ఏమిటో అర్ధం అయిపోతుందని, అతను ఈ విషయంలో చాలా బలహీనంగా స్పందించాడని జెలెన్‌స్కీ అన్నారు.
అవును, రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రాబల్యం తగ్గుతోందని, అతను బలహీనపడుతున్నాడని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెబుతూ తన ఆధిపత్యం పెరుగుతోందని చెప్పకనే చెప్పుకొచ్చారు.
"""/" /
ఇటీవల ప్రైవేటు ఆర్మీ వాగ్నర్ దళం( Army Wagner ).
పుతిన్‌పై తిరుగుబాటుకు ప్రయత్నించిన విషయం అందరికీ తెలిసిందే.ఈ నేపథ్యంలో ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన జెలెన్‌స్కీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం కొసమెరుపు.
ఈ క్రమంలో ఆయన అనేక విషయాలను ప్రస్తావించారు.పుతిన్ అన్నీ కంట్రోల్ చేయడం లేదని తెలుస్తోందని, రష్యా లోపలికి చొచ్చుకెళ్లి కొన్ని ప్రాంతాలను వాగ్నర్ దళం టేకోవర్ చేసుకుంటోందని చెప్పుకొచ్చాడు.
అంతేకాకుండా వాగ్నర్ దళం ఉక్రెయిన్ సానుభూతిపరులని చెప్పుకొచ్చాడు.అవును, వాగ్నర్ అడుగుపెట్టిన ప్రాంతాల్లో పుతిన్ కంట్రోల్ లేదని తెలుస్తోందని జెలెన్‌స్కీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
"""/" /
పుతిన్ ఇన్నాళ్లూ వాడిన అధికారం ఇప్పుడు బాగా బలహీనపడుతోందని, ప్రిగోజిన్‌కు( Prigogine ) లభిస్తున్న మద్దతు గురించి పుతిన్ చాలా తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని జెలెన్‌స్కీ తెలిపారు.
ఇకపోతే, ఈ విషయాలు పలు మీడియాలలో వైరల్ గా మారగా ఈ విషయంపైన పుతిన్ చాలా ఘాటుగా స్పందించినట్టు తెలుస్తోంది.
యుద్ధభూమిలో ఉక్రెయిన్ బలం సన్నగిల్లుతోందని జెలెన్‌స్కీ వ్యాఖ్యలు చేస్తేనే అర్ధం అవుతుందని అన్నారు.
రాజమౌళి వల్లే తెలుగులో ఉన్న యంగ్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారా..?