ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా మే 20న బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ది ఇయర్ - 'ఆర్ఆర్ఆర్' వరల్డ్ డిజిటల్ ప్రీమియర్
TeluguStop.com
మే 20న బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ది ఇయర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శక ధీరుడు రాజమౌళి, ఎన్టీఆర్ కలయికలో రూపొందిన 'ఆర్ఆర్ఆర్' వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ఇం డియాస్ బిగ్గెస్ట్ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ 'జీ 5'లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ది ఇయర్ 'ఆర్ఆర్ఆర్' వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ షో చూడటానికి ఆడియన్స్ రెడీనా!? ప్రజలకు కావాల్సినంత వినోదం ఇవ్వడం కోసం 'జీ 5' రెడీ అయింది.
మే 13న మీకొక న్యూస్ చెబుతామంటూ జీ 5 కొన్ని రోజులుగా వీక్షకుల్లో ఆసక్తి పెంచుతూ వస్తోంది.
ఫైనల్లీ.ఈ రోజు ఆ న్యూస్ ఏంటో చెప్పేసింది.
మే 20న 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నట్టు వెల్లడించింది.యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా దర్శకుడు రాజమౌళి రూపొందించిన దృశ్య కావ్యం 'ఆర్ఆర్ఆర్'.
మే 20వ తేదీన 'జీ 5' ఓటీటీ వేదికలో తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో విడుదల కానుంది.
ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో సినిమాను వీక్షకుల ముందుకు తీసుకొస్తోంది.నేటికి 'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదలై 50 రోజులు.
మే 20వ తేదీన యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కూడా! ఆయన అభిమానులకు కానుకగా డిజిటల్ తెరపైకి త్రిబుల్ ఆర్ సినిమాను జీ5 ఓటీటీ వేదిక తీసుకొస్తుందని చెప్పవచ్చు.
4k క్వాలిటీ, డాల్బీ డీటీఎస్ లో ప్రేక్షకులు సినిమాను చూడవచ్చు.TVOD పద్ధతిలో వీక్షకులకు సినిమా అందుబాటులో ఉంటుంది.
'ఆర్ఆర్ఆర్' సినిమాతో మరోసారి వీక్షకులకు అత్యుత్తమ వినోదం అందించడానికి 'జీ 5' కృషి చేస్తుందని మరోసారి రుజువైంది.
అందువల్ల, ప్రతి ఇంట 'జీ 5' పేరు వినబడుతోంది.జీ 5లో 'ఆర్ఆర్ఆర్' విడుదల విషయం దక్షిణాది భాషలు మాట్లాడే ప్రేక్షకులను మాత్రమే కాదు.
నాన్ సౌత్ స్పీకింగ్ ప్రేక్షకులకు కూడా సంతోషాన్ని కలిగించింది.ఎందుకంటే.
సబ్ టైటిల్స్ తో సినిమాను చూడొచ్చు కదా!
మే 20న 'ఆర్ఆర్ఆర్' డిజిటల్ రిలీజ్ సందర్బంగా జీ 5 కొత్త ట్రైలర్ విడుదల చేసింది.
అది ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.మరోసారి సినిమాను చూడాలనే ఆసక్తి కలిగించింది.
ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో వసూళ్ల పరంగా
'ఆర్ఆర్ఆర్' సినిమా రికార్డులు సృష్టించింది పదకొండు వందల కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.
రాజమౌళి తర్వాత వరుస సక్సెస్ లను అందుకుంటున్న దర్శకుడు ఎవరో తెలుసా..?