టాలీవుడ్ హీరోలకు అది కొంచెం ఎక్కువేనంటున్నబాలీవుడ్ హీరోయిన్…

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తిరు దర్శకత్వం వహించినటువంటి చాణక్య చిత్రంలో పవర్ఫుల్ రా ఏజెంట్ పాత్రలో నటించినటువంటి బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ తెలుగు ప్రేక్షకులను బాగానే మెప్పించింది.

అయితే ఈ అమ్మడు ప్రస్తుతం హీరోయిన్ గా మరియు మోడల్ గా బాలీవుడ్ లో బాగానే రాణిస్తోంది.

అయితే ఈ మధ్య కాలంలో జరీన్ ఖాన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అందుబాటులో ఉంది.

అయితే తాజాగా జరీన్ ఖాన్ తన అభిమానులతో సోషల్ మీడియా మాధ్యమం అయినటువంటి ఇంస్టాగ్రామ్ లో చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించింది.

ఇందులో భాగంగా తన అభిమానులు అడిగినటువంటి పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.కాగా ఓ నెటిజన్ తెలుగు సినిమాలు మరియు సినిమా పరిశ్రమపై మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నించాడు.

దీంతో జరీనా ఖాన్ సౌత్ హీరోలకు క్రమశిక్షణ ఎక్కువని మరియు అంతేగాక తాజాగా తాను నటించినటువంటి చాణుక్య చిత్ర యూనిట్ సభ్యులు తనని ఎంతో గౌరవించారని ఆ విషయం తనకు బాగా నచ్చిందని చెప్పుకొచ్చింది.

పని విషయంలో సమయ నిబంధనలు కచ్చితంగా పాటిస్తారనని ఆర్టిస్టులను ఎక్కవ ఇబ్బంది పెట్టరని కూడా తెలిపారు.  అంతేగాక తెలుగులో తనకు సినిమాలు చేయాలని ఉందని తన పాత్రకు సరిపోయే కథ దొరికితే కచ్చితంగా చేస్తానని కూడా చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం జరీన్ ఖాన్ "హమ్ బి అకేలే తుమ్ బి అకేలే" అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించినటువంటి చిత్రీకరణ దాదాపుగా పూర్తయ్యాయి.దీంతో ఈ చిత్రాన్ని ఆగస్టు నెలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.

వైరల్ వీడియో: ఏంటి భయ్యా.. బతికున్న నల్లత్రాచుకు నేరుగా పూజలు చేస్తున్న కుటుంబం..