ముద్రగడ వ్యవహారంపై వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ పద్మనాభం.జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి లేఖ రాయడం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.

కాపు ఉద్యమం సమయంలో.పవన్ మద్దతు తెలపకుండా ఉండటాన్ని ప్రశ్నించారు.

ఇంకా అనేక విషయాలపై లేఖలో ప్రస్తావించటం జరిగింది.ఇదే సమయంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాపు ఉద్యమ సమయంలో మద్దతు తెలిపినట్లు లేఖలో స్పష్టం చేశారు.

కులాన్ని అడ్డుపెట్టుకుని నాయకుడిగా ఎదగలేదు.యువతను వాడుకుని భావోద్వేగాలు రెచ్చగొట్టలేదు.

ప్రభుత్వం మారినప్పుడల్లా నేను ఉద్యమాలు చేయలేదు.ఇంకా సభలలో పవన్ మాట్లాడే భాష తీరుపై కూడా లేఖలో ముద్రగడ తప్పు పట్టడం జరిగింది.

ఇంకా తనని తాను ముఖ్యమంత్రిగా పవన్ ప్రకటించుకోవడాని కూడా.లేఖలో ఖండించడం జరిగింది.

"""/" /   పరిస్థితి ఇలా ఉంటే ముద్రగడ పద్మనాభం వెనుక వైసీపీ ఉన్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఈ వ్యవహారంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు.ముద్రగడ్డ వెనుక వైసీపీ ఉందనడంలో వాస్తవం లేదని పేర్కొన్నారు.

గొప్ప పోరాటాలు చేసిన నేత ముద్రగడ అని అభివర్ణించారు.ఒకరి ప్రభావంతో ఆయన రాజకీయాలు చేయరు అని పేర్కొన్నారు.

175 స్థానాలలో పోటీ చేయకుండా సీఎం చేయండని అర్థమేంటని ముద్రగడ అడగటంలో తప్పేముంది.

ముద్రగడ లాంటి పెద్దలు సలహాలు పవన్ పాటిస్తే ఆయనకే మంచిది.ఇక ఇదే సమయంలో సెప్టెంబర్ నెల నుంచి సీఎం జగన్ విశాఖలో ఉంటారని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు.

ఆలియా నా జీవితంలో చాలా స్పెషల్… రణబీర్ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?