విశాఖ పరిపాలన రాజధానిపై వై వి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు…
TeluguStop.com
విశాఖ, సింహాచలం: శ్రీ వరహాల లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం కృష్ణాపురం గోశాలలో నూతనంగా నిర్మించిన గో సంరక్షణర్థం షెడ్ ను ప్రారంభించిన టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ విశాఖ పరిపాలన రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేసారు.
విశాఖ ను పరిపాలన రాజదాని చేసి తీరుతాము.ఇదే విషయాన్ని సీఎం జగన్ స్పష్టంగా చేప్పారు.
"""/" /
విశాఖ లో ఉన్న ఐటి ,ప్రభుత్వ , విఎంఆర్డీఏ భవనాలలో ఖాళీగా ఉన్నవాటిని వాడుకుంటాము.
అవసరమైతే ప్రైవేట్ భవనాలు తీసుకుంటాము.భీమిలి ప్రాంతంలో అనేక ప్రభుత్వ భవనాలు ఉన్నాయి.
సీఎం నివాసం ,క్యాంపు కార్యలయం కోసం కొన్ని ప్రైవేటు గెస్ట్ హౌస్ లు, ప్రభుత్వ గెస్ట్ హౌస్ లు పరిశీలన లో ఉన్నాయి.
ఖచ్చితంగా ఏప్రిల్ లోపే న్యాయపరమైన చిక్కులన్ని తొలగించి విశాఖ ను పరిపాలన రాజదాని చేస్తాం.