బాధలన్నీ పంటిబిగువనే భరించా అంటూ యువీ భార్య చేసిన ఈ పోస్ట్ చూస్తే కన్నీళ్లొస్తాయి.!
TeluguStop.com
పదేళ్ల క్రితం ఎలా ఉన్నాం, గతంతో పోలిస్తే ఇప్పుడు మనలో వచ్చిన మార్పులేంటి తదితర అంశాలను ఫొటోలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి.
ఎంతో సెలెబ్రిటీలు తమ ఫోటోలను షేర్ చేస్తున్నారు.ఈ తరుణంలో యువరాజ్ సింగ్ భార్య పెట్టిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది.
ఆమె పెట్టిన పోస్టు చాలా భావోద్వేగంతో నిండి ఉంది.అదేంటి అంటే.
‘22 నుంచి 32 ఏళ్లు.ఇంత దూరం ప్రయాణించానా! అప్పుడు డిప్రెషన్‌ను జయించేందుకు యుద్ధం చేసేదాన్ని, ఉపవాసం ఉండేదాన్ని, జుట్టుకు చిక్కగా రంగేసుకునేదాన్ని.
నా చుట్టూ ఉన్నవాళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇలాంటి పనులన్నీ చేసేదాన్ని.వారిని సంతోషంగా ఉంచేందుకు బాధలన్నీ పంటిబిగువనే భరించాను.
కానీ ఈరోజు పూర్తి విశ్వాసంతో మాట్లాడగలను.ఎవరు ఏమనుకుంటారోనన్న భయం లేదు.
ఇప్పుడు ధైర్యంగా జుట్టు కత్తిరించుకుంటున్నా.నా సంతోషం కోసమే నేను బతుకుతున్నా.
ఇంత ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉంటానని ఎప్పుడూ కనీసం ఊహించలేదు.10ఇయర్స్‌చాలెంజ్ మొదలుపెట్టిన వారికి కృతఙ్ఞతలు’ అంటూ హాజిల్ కీచ్ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్ చేశారు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ఆమె పోస్టుకి నెటిజన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది.
మీలాంటివారు మాకు ఆదర్శం అంటూ.నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
అబ్బా అన్న.. ఎంత మంచి మనసే నీది.. కానీ పోలీసులు చూశారో..