అనారోగ్యంతో వైఎస్సార్ సీపీ నేత మృతి

వైఎస్సాఆర్ సీపీ పార్టీలో మరో విషాదం చోటు చేసుకుంది.పార్టీ నేతలు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు.

కరోనా వల్ల కొందరు మరణించగా.మరికొందరు అనారోగ్య సమస్యలతో మరణిస్తున్నారు.

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన వైఎస్సార్ సీపీ నేత రాజ్ కుమార్ స్వర్గీయులయ్యారు.

ప్రముఖ వస్త్ర వ్యాపారి, బొమ్మన బ్రదర్స్ అధినేత అయిన రాజ్ కుమార్ గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు.

దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ చేయించి చికిత్స అందిస్తున్నారు.

పరిస్థితి విషమించడంతో మంగళవారం మధ్యాహ్నం కన్నుమూశారు.దీంతో వైఎస్సాఆర్ పార్టీ నేతలు, కార్యకర్తలు దిగ్భ్రాంతికి లోనై సంతాపం వ్యక్తం చేశారు.

మరణాంతరం కుటుంబ సభ్యులు రాజ్ కుమార్ పార్థీవదేహాన్ని తమ స్వస్థలమైన రాజమండ్రికి తరలించారు.

ఈ రోజు (బుధవారం) కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో ఆయన అంత్యక్రియలు జరుగనుంది.

ఈ మేరకు సీఎం జగన్ వైసీపీ నేత రాజ్ కుమార్ మరణవార్త విని తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని అందజేశారు.సంతాప సూచికంగా నగరంలోని వ్యాపారస్థులు కూడా బుధవారం స్వచ్ఛందంగా షాపులు మూసివేస్తున్నారు.

2014లో వైఎస్సాఆర్ సీపీ పార్టీ తరఫున రాజ్ కుమార్ రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయాడు.

తదనంతరం పార్టీలో కీలక నేతగా కొనసాగారు.ప్రస్తుతం ఆయన నిజాంపేట అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా కొనసాగారు.

అరుదైన శివుని విగ్రహాన్ని చోరీ చేసిన భారత సంతతి స్మగ్లర్ .. కంబోడియాకు తిరిగి పంపిన అమెరికా