షర్మిల కాంగ్రెస్ కు మద్దతిస్తే.. లాభామా ? నష్టమా ?
TeluguStop.com
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YSRTP YS Sharmila ) తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని లేదా కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతారని ఇలా రకరకాల వార్తలు షికారు చేస్తున్నాయి.
అయితే వైరల్ అవుతున్న ఈ పుకార్లను షర్మిల ఎప్పటికప్పుడు ఖండిస్తున్నప్పటికి.నిప్పులేనిదే పొగ రాదు అన్నట్లు వార్తలు మాత్రం ఆగడం లేదు.
తెలంగాణలో షర్మిల పార్టీ స్థాపించి రెండేళ్ళు గడుస్తున్నప్పటికి.రాష్ట్రంలో ఆమె పార్టీ స్థానమేంటో గుర్తించలేని పరిస్థితి.
కేసిఆర్ పాలనపై ఘాటైన విమర్శలు, బీజేపీ( BJP ), కాంగ్రెస్ పార్టీలపై పదునైన వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ వేడి పెంచుతున్నప్పటికి షర్మిల పార్టీకి మాత్రం సరైన రీతిలో ఆధారణ లభిచడం లేదు.
"""/"/ ఇక పాదయాత్ర చేసినప్పటికీ పెద్దగా మైలేజ్ తీసుకురాలేకపోయింది వైఎస్ షర్మిల.
ఇక ఆ మద్య చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఆమెకు ఉన్న ఇమేజ్ కూడా డ్యామేజ్ అయిందనే చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ కు మద్దతు పలుకే అవకాశం ఉందనే మాట గట్టిగానే వినబడుతోంది.
కాగా ఆమె కాంగ్రెస్( Congress ) లో చేరాలని అటు హస్తం నేతలు కూడా ఆహ్వానిస్తున్నారు.
ఈ నేపథ్యంలో షర్మిల నిజంగానే కాంగ్రెస్ కు మద్దతు తెలిపితే.ఆ పార్టీకి ఎంతవరకు ప్లెస్ అవుతుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం తెలంగాణలో హస్తం పార్టీ( Telangana Congress ) ఫుల్ జోష్ లో ముందుకు సాగుతోంది.
"""/"/ ఆ పార్టీలో ప్రత్యర్థులకు ఘాటుగా సమాధానం చెప్పే నేతలు చాలా మందే ఉన్నారు.
మహిళల విషయంలో సీతక్క గట్టిగానే ప్రభావం చూపుతోంది.ఈ నేపథ్యంలో షర్మిల కాంగ్రెస్ కు తోడైతే మరింత బలం పెరిగే అవకాశం ఉంది.
తెలంగాణలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి( YS Rajasekhar Reddy ) అభిమానుల సంఖ్య మెండుగా ఉంది.
వారి ఓటు బ్యాంకు అంతా కూడా షర్మిల ద్వారా కాంగ్రెస్ వైపు తిరిగే అవకాశం ఉంది.
అటు షర్మిల కూడా ఒక బలమైన నేతగా హస్తం పార్టీలో మరింత రాటుదేలే అవకాశం ఉంది.
కాబట్టి ఒకవేళ వైఎస్ షర్మిల కాంగ్రెస్ కు మద్దతు తెలిపితే ఇటు ఆమెకు.
అటు హస్తం పార్టీకి నష్టం కంటే లాభలే అధికంగా ఉంటాయనేది కొందరి విశ్లేషకుల అభిప్రాయం .
కొరటాల శివకు డేట్స్ ఇవ్వలేకపోతున్న స్టార్ హీరోలు…కారణం ఏంటి..?