వైఎస్సార్ సువర్ణ పాలన షర్మిలమ్మతోనే సాధ్యం:పచ్చిపాల వేణు యాదవ్
TeluguStop.com
సూర్యాపేట జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మళ్లీ ప్రతిపల్లెకు,ప్రతి గడపకు చేరాలంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలమ్మతోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కోదాడ నియోజకవర్గ ఇంచార్జ్ పచ్చిపాల వేణు యాదవ్ అన్నారు.
బుధవారం నడిగూడెం మండల కేంద్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని త్వరలో జరగబోయే నడిగూడెం మండలం విస్తృత స్థాయి సమావేశంలో వివిధ పార్టీల నాయకుల చేరికలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న షర్మిలమ్మ నాయకత్వంలో పనిచేయడానికి వివిధ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పార్టీలో చేరబోతున్నారని తెలిపారు.
ఈ సమావేశాల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కన్నెబోయిన రామారావు, మండల పార్టీ అధ్యక్షుడు ఎస్కే రహీం,పందిరి లక్ష్మీ నరసింహారెడ్డి,నడిగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు దున్న రవి,మోతె మండల యువజన విభాగం అధ్యక్షుడు కుంచం నవీన్, శ్రీకాంత్ రెడ్డి,పవన్, లక్ష్మయ్య,దున్న భీమ్, కొత్తపల్లి వంశీ,చెరుకుపల్లి వెంకన్న,వీరబాబు,చారి తదితరులు పాల్గొన్నారు.
ఇదేందయ్యా ఇది.. జింక అలా ఎగురుతుంది? (వీడియో)