YSRCP Fourth Siddham Meeting : నాలుగోసారి జగన్ ‘ సిద్ధం ‘ .. ఎక్కడంటే.. ?
TeluguStop.com
రాబోయే ఏపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్( AP CM YS Jagan ) స్పీడ్ పెంచుతున్నారు.
మొన్నటి వరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికే జగన్ పరిమితం అయిపోతున్నారు అంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్న క్రమంలో , పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచడంతోపాటు, ప్రజల్లో తమకు ఉన్న బలాన్ని నిరూపించుకునేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు.
దీనిలో భాగంగానే సిద్ధం( Siddham ) పేరుతో భారీగా సభలను నిర్వహిస్తూ, పార్టీ కార్యకర్తల్లో జోష్ పెంచుతున్నారు.
ఇప్పటికే మూడు విడతలుగా సిద్ధం సభలు నిర్వహించారు .ఈ సభలు అనుకున్న దానికంటే ఎక్కువగా సక్సెస్ కావడంతో, మరింత ఉత్సాహంతో ఉన్నారు.
ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి పట్టున్న చోటే ఈ సిద్ధం సభలను నిర్వహిస్తున్నారు.మొదటి విడతగా విశాఖ జిల్లా భీమిలి( Bheemili )లో సిద్ధం సభను నిర్వహించారు.
ఆ తరువాత ఏలూరు జిల్లా దెందులూరు లోను ఆ తరువాత అనంతపురం జిల్లా రాప్తాడు( Raptadu ) లోనూ సిద్ధం సభలు ఏర్పాటు చేశారు .
"""/"/
ఒక సభను మించి మరో సభ ఉండడం , భారీగా పార్టీ కార్యకర్తలు హాజరు కావడంతో జగన్ మరింత ఉత్సాహంగా ఉన్నారు.
నాలుగో విడత సిద్ధం సభను అంతే స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పల్నాడులో టిడిపికి అనుకూల ప్రాంతంగా ఉన్న చిలకలూరిపేటలో నాలుగో సిద్ధం సభ( Chilakaluripet Siddham Meeting )ను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.
ఈ నియోజకవర్గంలోని బొప్పూడి వద్ద 200 ఎకరాల స్థలంలో సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు .
ఇది జాతీయ రహదారికి దగ్గరగా ఉన్న ప్రాంతం కావడం, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణాజిల్లాల పరిధిలోని 54 నియోజకవర్గాల నుంచి ఈ సభ కు తరలి వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
గత మూడు సిద్ధం సభల కంటే మరింత భారీగా ఈ సభను నిర్వహించేందుకు వైసిపి ఏర్పాట్లు చేసుకుంటుంది.
"""/"/
వాస్తవంగా రాప్తాడు మూడో విడత సిద్ధం సభలోనే వైసీపీ మేనిఫెస్టోను( YCP Manifesto ) జగన్ ప్రకటిస్తారని అంతా భావించారు .
అయితే చిలకలూరిపేటలో నిర్వహించబోయే నాలుగో విడత సిద్ధం సభ( YSRCP Fourth Siddham Meeting )లోనే జగన్ మేనిఫెస్టో ప్రకటిస్తారనే అంచనాలు అందరిలోనూ నెలకొన్నాయి.
‘ రా ’ ఏజెంట్‌నంటూ ఎన్ఆర్ఐ మహిళపై అత్యాచారం .. వెలుగులోకి జిమ్ ట్రైనర్ బాగోతం