టైమ్స్ నవ్ సంస్థ ఏపీ ఎంపీ సీట్ల ఎగ్జిట్ పోల్స్ లెక్కలివే.. మెజార్టీ సీట్లలో వైసీపీదే విజయం!
TeluguStop.com
ఏపీ ఎగ్జిట్ పోల్స్( AP Exit Polls) ఫలితాలతో మెజారిటీ సర్వే సంస్థలు వైసీపీదే అధికారమని తేల్చి చెబుతున్నాయి.
టైమ్స్ నవ్ ఈటీజీ రీసెర్చ్ సంస్థ( Times Now-ETG Survey ) ఎంపీ ఫలితాలకు సంబంధించి వెల్లడించిన లెక్కలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ సంస్థ ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 25 లోక్ సభ ఎంపీ స్థానాలలో వైసీపీకి 14 స్థానాలలో విజయం దక్కనుంది.
రాష్ట్రంలోని 60 శాతం ఎంపీ సీట్లు వైసీపీ కైవసం కానున్నాయి.మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నా ఆ పార్టీలకు మాత్రం కేవలం 11 స్థానాల్లో గెలుపు దక్కే ఛాన్స్ ఉంది.
టైమ్స్ నవ్ ఈటీజీ సంస్థకు మంచి పేరు ఉండగా ఈ ఎన్నికల ఫలితాలు ఆ సంస్థ ఖ్యాతిని మరింత పెంచుతాయని తమ సంస్థ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే నిజమవుతాయని సంస్థ భావిస్తోంది.
14 ఎంపీ స్థానాల్లో వైసీపీకి విజయం దక్కితే ఆటోమేటిక్ గా మెజారిటీ ఎమ్మెల్యే స్థానాల్లో సైతం వైసీపీ సత్తా చాటుతుంది.
"""/" /
11కు పైగా సర్వే సంస్థలు రాష్ట్రంలో వైసీపీ గెలుపు ఖాయమని చెబుతున్నాయి.
రాష్ట్రంలో గెలుపు విషయంలో ఉన్న గందరగోళ పరిస్థితులను సర్వే సంస్థలు కొంతమేర తగ్గించేశాయి.
గెలుపు వైసీపీదే దాదాపుగా అన్ని ప్రముఖ సంస్థలు తేల్చి చెప్పేశాయి.మూడు పార్టీలతో పొత్తు పెట్టుకున్న నేతలు మరోమారు ప్రతిపక్షానికి పరిమితం కావాల్సిన పరిస్థితి అయితే నెలకొందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
"""/" /
బాబు పాలన పట్ల విసుగు చెందిన ఏపీ ప్రజలు గత ఎన్నికల్లో వైసీపీని గెలిపించారని బాబు పాలనను ఏపీ ప్రజలు మళ్లీ కోరుకోవడం లేదని ఏపీ ప్రజలు నమ్ముతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో మళ్లీ వైసీపీకి విజయం దక్కితే సంక్షేమంతో పాటు అభివృద్ధి జరుగుతుందని ఓటర్లు ఫీలవుతున్నారు.
ఏపీ మహిళలు వైసీపీని మళ్లీ గెలిపించుకోనున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఆస్ట్రేలియా బౌలర్లకు తాట తీసిన జైస్వాల్.. దిగ్గజాల సరసన చోటు