గడప గడపకు సరే ! గ్రూపు రాజకీయాల సంగతేంటో ?

గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.పార్టీ కార్యకర్త నుంచి అగ్ర నాయకుల వరకు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు.

నిత్యం జనాల్లో ఉండడమే ఏకైక పనిగా పెట్టుకోవాలని నాయకులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.

వైసిపి నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలే కాకుండా ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు.

అక్కడక్కడ అనేక ప్రజా సమస్యల గురించి ప్రజా ప్రతినిధులను నిలదీయడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

అంతిమంగా జగన్ ఆశించిన స్థాయిలోనే ఈ గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం జరుగుతోంది.అయితే ఇక్కడే పార్టీలోని గ్రూపు రాజకీయాలు బయటపడుతున్నాయి.

పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ రెండు మూడు గ్రూపులుగా నాయకులు విడిపోవడం, ఎవరికి వారే తామే గొప్ప అన్నట్లుగా వ్యవహరిస్తుండడం, ఇలా ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటూ నిత్యం పార్టీ నాయకుల మధ్య వివాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితిని చక్కదిద్దేందుకు వైసిపి అధిష్టానం రంగం లోకి దిగుతున్నా దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉండడంతో ఎప్పటికప్పుడు వార్నింగ్ లు ఇస్తూ సరి పెట్టేస్తున్నారు.

అయితే ఈ మధ్యకాలంలో ఈ గ్రూపు రాజకీయాలు మరింత తీవ్రతరం అయ్యాయి.రాబోయే ఎన్నికల్లో టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేసే వారు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మధ్య ఈ వివాదాలు ఎక్కువగా నడుస్తున్నాయి.

గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం సందర్భంగా ఈ గ్రూపు రాజకీయాలు, వివాదాలు ఎక్కువ అవుతూ ఉండడం ఇబ్బందికరంగా అధిష్టానానికి మారింది.

ఇప్పటికే పార్టీ సీనియర్ నాయకులు కొంతమందిని ఈ వ్యవహారాలను చక్కబెట్టాల్సిందిగా జగన్ ఆదేశించారు.

మరికొన్ని కీలక నియోజకవర్గాల విషయంలో స్వయంగా జగన్ కలుగ చేసుకుంటూ క్యాంప్ ఆఫీస్ కు సదరు నాయకులను పిలిపించి మరి వార్నింగ్ ఇస్తూ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రస్తుతం సజ్జల రామకృష్ణారెడ్డి , విజయసాయిరెడ్డి, జగన్ ఈ గ్రూపు రాజకీయాలను చక్కదిద్దే పనిలో నిమగ్నమయ్యారు.

ఈ వివాదాల కారణంగా ప్రజల్లో పార్టీ పరువు దెబ్బతింటూ ఉండడం, ప్రతిపక్షాలకు ఆయుధంగా అవి మారుతుండటం వంటి వ్యవహారాలన్నీ జగన్ కు చీకాడు కలిగిస్తున్నాయి.

"""/"/ ఇప్పటికే గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ, గట్టు రామచంద్రరావు వర్గాల వ్యవహారం జగన్ వరకు వెళ్ళింది.

దీంతో తాడేపల్లి క్యాంపు ఆఫీసుకు పిలిపించి మరి మాట్లాడినట్లు సమాచారం.ఇక నందికొట్కూరు నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి.

అక్కడ ఎమ్మెల్యే ఆర్థర్, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తూనే ఉంది.

కోడుమూరు నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే సుధాకర్, చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మధ్య వివాదాలు నడుస్తున్నాయి.

ఈ విధంగా బహిరంగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే వరకు పరిస్థితి వెళ్లింది.

ఇలా చెప్పుకుంటూ వెళితే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ పరిస్థితి అదుపు తప్పుతూ ఉండడంతో జగన్ సైతం ఆందోళన చెందుతున్నారట.

22 ఏళ్లుగా పాక్‌లో నరకయాతన.. ఒక్క యూట్యూబ్ వీడియో ఆమె జీవితాన్నే మార్చేసింది..?