అంతా వారే చేస్తున్నారు ! ఆ నివేదికలపై వైసీపీ ఎమ్మెల్యే ల గుస్సా  ? 

ఏపీ అధికార పార్టీ వైసీపీలో సర్వేలు కలకలం సృష్టిస్తున్నాయి.ఈ సర్వే నివేదికల ఆధారంగానే ప్రస్తుతం నియోజకవర్గ ఇన్చార్జిల మార్పుకు జగన్ శ్రీకారం చుట్టారు.

సీనియర్లు , సెట్టింగ్ ఎమ్మెల్యేలను తప్పించి కొత్తవారికి అవకాశం ఇస్తున్నారు.అలాగే ప్రస్తుతం ఇన్చార్జిలు గా కొనసాగుతున్న వారిని తప్పించడం వంటివి చేపట్టారు .

ఈ లిస్టులో జగన్ కు అత్యంత సన్నిహితులైన వారు , మంత్రులు , ఇతర కీలక నాయకులు ఉన్నారు .

అయినా జగన్ ఎక్కడా మొహమాటలకు వెళ్లకుండా గెలుపు గుర్రాలకే టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

ఇదే విషయాన్ని ఎమ్మెల్యేలు ,మంత్రులకు,  నియోజకవర్గ ఇన్చార్జిలకు చెబుతున్నారు.ఇప్పుడు తప్పించిన వారికి పార్టీలో సముచిత స్థానం ఇస్తామని ,మళ్లీ అధికారంలోకి వచ్చాక కీలక పదవులు ఇస్తామని నచ్చచెప్పే ప్రయత్నం ముందుగానే చేపట్టారు.

వై నాట్ 175 అనే నినాదాన్ని ఇస్తూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే ప్రస్తుతం నియోజకవర్గ ఇన్చార్జిల మార్పు వెనుక ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ టీం ఉందని , వారి నివేదికల ఆధారంగానే నియోజకవర్గ ఇన్చార్జిల మార్పుకు జగన్ శ్రీకారం చుట్టారని,  ఐప్యాక్ టీం పై వైసీపీ ఎమ్మెల్యేలు,  నియోజకవర్గ ఇన్చార్జీలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు అందించారు .

ఇక ఆ తర్వాత ఆయన ఐ ప్యాక్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.బీహార్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ శిష్యులైన ఋషిరాజ్ వైసీపీకి రాజకీయ వ్యూహకర్త గా వ్యవహరిస్తున్నారు.

"""/" /  వారి నేతృత్వంలోనే నియోజకవర్గాల వారీగా నివేదికలు తయారవుతున్నాయి.  వారి నివేదిక ఆధారంగానే జగన్ మార్పు చేర్పులకు శ్రీకారం చుడుతున్నారు .

కేవలం టిక్కెట్లు ,నియోజకవర్గ ఇన్చార్జిలో మార్పు అంశాలతో పాటు,  ఎక్కడెక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనే దానిపైన ఐ ప్యాక్ టీం ఇచ్చిన నివేదికలపై జగన్ ఆధారపడుతూ ఉండడంతో , జగన్ ను వారు తప్పుదోవ పట్టిస్తున్నారని, గ్రౌండ్ రియాల్టీ ఏమిటనేది చెప్పకుండా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.

ప్రభాస్ మద్యం తాగుతాడా అనే ప్రశ్నకు ఆ ఏఐ చెప్పిన జవాబిదే.. ఏం చెప్పిందంటే?