పుష్ప ది రూల్ ట్రైలర్ కు మద్దతుగా ఆ పార్టీ పోస్టులు.. బన్నీ రేంజ్ పెరిగిందా?

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటించిన తాజా చిత్రం పుష్ప‌ 2.

( Pushpa 2 ) సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలె షూటింగ్ ని పూర్తి చేసుకొని ప్రస్తుతం ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే.

ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగానే తాజాగా బీహార్ రాజధాని పాట్నాలో ఈ సినిమా ట్రైలర్ ను లాంచ్ చేశారు మూవీ మేకర్స్.

ఈ కార్య‌క్ర‌మానికి భారీగా అభిమానులు త‌ర‌లి వెళ్లారు.అయితే జ‌న సందోహాన్ని, ప‌వ‌న్ స‌భ‌కు వ‌చ్చే జ‌నంతో పోల్చుతూ సోష‌ల్ మీడియా ట్రోల్ చేయ‌డం గ‌మ‌నార్హం.

"""/" / ప‌వ‌న్‌కు( Pawan Kalyan ) కేవ‌లం ఏపీలో మాత్ర‌మే జ‌నం వ‌స్తార‌ని, కానీ బ‌న్నీకి ఉత్త‌రాధి రాష్ట్రంలోని పాట్నాలో కూడా పోటెత్తార‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేయ‌డం గ‌మ‌నార్హం.

ఇలా పుష్ప హీరోకి మ‌ద్ద‌తుగా పోస్టులు పెడుతున్న వాళ్ల‌లో వైసీపీ అభిమానులు ఉండ‌డం విశేషం.

బ‌న్నీకి వైసీపీ( YCP ) అండ‌గా నిల‌బ‌డడానికి కార‌ణం కూడా లేక‌పోలేదు.ఎందుకంటె ఈ ఏడాది జరిగిన ఎన్నిక‌ల సమయంలో బ‌న్నీ నంద్యాల‌ లోని త‌న స్నేహితుడైన శిల్పా ర‌విచంద్రా రెడ్డి( Silpa Ravichandra Reddy ) ఇంటికెళ్లారు.

అనుమ‌తి లేకుండా వైసీపీ నాయ‌కుడు శిల్పాకు మ‌ద్ద‌తుగా బ‌న్నీ ప్ర‌చారానికి వెళ్లాడంటూ కూట‌మి నేత‌లు ఫిర్యాదు చేశారు.

"""/" / ఎన్నిక‌ల సంఘం సీరియ‌స్‌ గా తీసుకుని కేసు పెట్టాల‌ని నంద్యాల ఎస్పీని ఆదేశించింది.

ఇటీవ‌లే ఆ కేసు కొట్టేయాల‌ని బ‌న్నీ ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించారు.బ‌న్నీకి హైకోర్టులో ఊర‌ట ల‌భించింది.

ఈ కేసును కొట్టేసిన సంగ‌తి తెలిసిందే.మ‌రోవైపు వైసీపీకి మ‌ద్ద‌తుగా బ‌న్నీ ప్ర‌చారానికి వెళ్లారని, ఆయ‌న‌పై నాగ‌బాబు ఘాటు పోస్టు పెట్టారు.

దీంతో బ‌న్నీ జ‌న‌సేన శ్రేణుల మ‌ధ్య చిన్న‌పాటి వార్ జ‌రిగింది.చివ‌రికి నాగ‌బాబు( Nagababu ) త‌న పోస్టును డిలీట్ చేయ‌డంతో స‌మ‌స్య స‌ర్దుమ‌ణిగింది.

ఇటీవ‌ల ప‌వ‌న్‌ క‌ల్యాణ్ గురించి బ‌న్నీ మంచి మాట‌లు చెప్పారు.దీంతో విభేదాలు తొలిగాయ‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

కానీ ఇప్పుడు అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ట్రైలర్ కు వైసీపీ నాయకులు మద్దతుగా నిలుస్తుండడంతో మరోసారి ఈ వివాదం తెరపై వచ్చేలా కనిపిస్తోంది.

పుష్ప ది రూల్ ట్రైలర్ కు మద్దతుగా ఆ పార్టీ పోస్టులు.. బన్నీ రేంజ్ పెరిగిందా?