వైసీపీ లో మరో ధిక్కార స్వరం ?
TeluguStop.com
ఏపీ అధికార పార్టీ వైసీపీలో ధిక్కార స్వరాలు పెరిగిపోతున్నాయి.ఇప్పటికే పార్టీ నియమ నిబంధనలను ఉల్లంఘించి బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు, ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలను కలిపి మొత్తం నలుగురిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
అంతేకాకుండా వారిపై అనర్హత వేటు వేసి ఉప ఎన్నికలకు వెళ్లే ఆలోచనలోనూ జగన్ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.
వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే ధిక్కార స్వరం వినిపిస్తే, వారు ఎంతటి వారైనా ఉపేక్షించననే సంకేతాలను ఈ నలుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్ ద్వారా జగన్( YS Jagan ) చూపించారు.
దీనివల్ల తనకు, పార్టీకి నష్టం జరిగినా, తాను లెక్క చేయను అనే సంకేతాలను ఇచ్చారు.
దీని కారణంగా మిగతా ఎమ్మెల్యేల్లో భయం ఉంటుందని , పార్టీ , ప్రభుత్వ వ్యవహారాలలో ఏదైనా అసంతృప్తి ఉన్న అంతర్గతంగా చర్చిస్తారు తప్ప , బహిరంగంగా విమర్శలు చేయరని జగన్ అంచనా వేశారు .
"""/" /
కానీ తాజాగా మరో ఎమ్మెల్యే గొంతు పెంచారు.తిరుమల దర్శనానికి( TTD ) తాజాగా వెళ్ళిన గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్న రాంబాబు ప్రోటోకాల్ విషయమై ఫైర్ అయ్యారు.
దర్శనానికి వెళ్ళిన తనకు మాత్రమే అధికారులు ప్రోటోకాల్ కల్పించి, తన భార్యకు జనరల్ బ్రేక్ దర్శనం మాత్రమే ఇప్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను స్వయంగా సీఎంవో లో కీలక అధికారిగా ఉన్న ధనుంజయ రెడ్డి నుంచి సిఫార్సు లేఖ తెచ్చుకున్నా.
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు లెక్క చేయకపోవడం పై ఫైర్ అయ్యారు.తాను దర్శనం చేసుకున్న సమయంలోనే 200 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కానీ వారు ప్రోటోకాల్ దర్శనం చేసుకుని వెళ్లారని, తన విషయంలో టిటిడి అధికారులు ఈ విధంగా వ్యవహరించారని అన్న రాంబాబు( Anna Rambabu ) విమర్శలు చేశారు.
దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది.ఎమ్మెల్యే తో పాటు పదిమందికి , సీఎంవో నుంచి మరో పదిమందికి, టీటీడీ చైర్మన్ ఆఫీస్ నుంచి ఇంకో పది మందికి ప్రోటోకాల్ దర్శనం సిఫార్సులు తెచ్చుకున్నారని, దీంతో ఎమ్మెల్యే తో పాటు పదిమందికి ప్రోటోకాల్ దర్శనం కల్పించామని, మిగిలిన వారికి మాత్రం జనరల్ బ్రేక్ దర్శనం మాత్రమే కల్పించినట్లు వివరణ ఇచ్చింది.
"""/" /
ఈ వ్యవహారంలో ఇంత బహిరంగంగా అన్న రాంబాబు విమర్శలు చేయాల్సిన అవసరం లేకపోయినా.
చాలా కాలంగా వైసీపీ అధిష్టానం పై అసంతృప్తితో ఉన్న రాంబాబు ఇప్పుడు బయట పడ్డారనే అనుమానాలు మొదలయ్యాయి.
ఈ వ్యవహారంపై టిటిడి వివరణ ఇచ్చిన నేపథ్యంలో. అన్నా రాంబాబు సైలెంట్ అవుతారా లేక మరేదైనా విషయాలపై మళ్ళీ తన అసంతృప్తిని వెళ్ళగక్కుతారా అనేది తేలాల్సి ఉంది.
పూరీ జగన్నాథ్, అలీలకు 2025 కలిసొస్తుందా.. వీళ్లు పూర్వ వైభవం సాధిస్తారా?