తిరుపతి ఉప ఎన్నికలలో హిస్టరీ క్రియేట్ చేస్తామంటున్న వైసీపీ మంత్రి..!!
TeluguStop.com
Span Style="font-weight: 400"ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ మరియు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లలో వైసిపి తిరుగులేని పార్టీగా మెజార్టీ స్థానాలు గెలవటం అందరికీ తెలిసిందే.
ఇదే విషయాన్ని జాతీయ మీడియా సైతం తెలియజేస్తూ 2019 ఎన్నికల టైంలో జగన్ ని ఏ విధంగా ప్రజలు నమ్మటం జరిగిందో అదే నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జగన్ పరిపాలన చేస్తున్నాడు అంటూ కథనాల మీద కథనాలు ప్రసారం చేస్తూ ఉంది.
జాతీయ మీడియా.ఇలాంటి తరుణంలో త్వరలో తిరుపతి ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో .
ఉప ఎన్నికల బాధ్యతలను కొంతమంది మంత్రులకు జగన్ అప్పజెప్పిన సంగతి తెలిసిందే./span """/" /
Span Style="font-weight: 400"వారిలో ఒకడు అయిన ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాజాగా తిరుపతి ఉప ఎన్నికల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
దాదాపు 4 లక్షల పై చిలుకు మెజారిటీ తిరుపతి ఉప ఎన్నికల్లో రావటం గ్యారెంటీ అని, చరిత్ర సృష్టిస్తామని ధీమాగా చెప్పుకొచ్చారు.
సీఎం జగన్ రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమం మరియు అభివృద్ధి ద్వారానే మరోసారి తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తామని స్పష్టం చేశారు.
ఇదే టైమ్ లో అమరావతి భూముల విషయంలో హైకోర్టులో చంద్రబాబు స్టే తెచ్చుకోవడం పట్ల కూడా స్పందించారు.
దీని బట్టి చూస్తే ఆయన తప్పు చేయటం వల్ల స్టే తెచ్చుకోవడం జరిగిందని అన్నారు.
చంద్రబాబు తప్పు చేయకపోతే విచారణకు హాజరవ్వాలి.బహుశా ప్రపంచంలోనే అత్యధిక స్టేలు సాధించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాదించాలని 420 చంద్రబాబు అనుకుంతటున్నట్టు ఉన్నాడు.
తిరుపతి ఉపఎన్నికలలో చరిత్ర సృష్టిస్తాం.మా 20నెలల పరిపాలనకు రెఫరెండమే పంచాయితీ,మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అంటూ అనిల్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
40 కోట్ల బడ్జెట్ పెడితే రూ.2 కోట్ల కలెక్షన్లు.. వరుణ్ తేజ్ జాగ్రత్త పడాల్సిందేనా?