చంద్రబాబును ఇంటివాడిని చేస్తున్న వైసిపి?
TeluguStop.com
తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు( N Chandrababu Naidu ) పై విమర్శలకు అధికార పార్టీ అత్యంత ప్రాధాన్యతని ఇస్తుంది .
ఆయనకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని విమర్శకు అనుకూలంగా మార్చుకొని ఆయనపై ముప్పేట దాడి చేస్తుంది.
దానికోసం ప్రత్యేకంగా కొంత మంది ప్రతినిధులను నియమించుకున్నారా అన్న లెవల్లో వరుస పెట్టి మీడియా సమావేశాలు పెట్టి మరి చంద్రబాబుపై విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి .
అయితే ఒక విమర్శను మాత్రం చంద్రబాబు సీరియస్ గా తీసుకునట్టే ఉన్నారు .
"""/" /
ఎందుకంటే ఆయన దానికి స్పందిచ్చి చర్యలు కూడా తీసుకుంటున్నారు అదేమిటి అంటే “కుప్పం నియోజక వర్గానికి ఆయన స్థానికేతరుడని” వై నాట్ 175 మిషన్ లో భాగంగా కుప్పంతో( Kuppam) సహా అన్ని స్థానాలను గెలుచుకోవాలని , కుప్పానికి చంద్రబాబు స్థానికేతరుడని ప్రచారం చేసిన వైసిపి అక్కడ జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో మంచి ఫలితాలు అందుకుంది.
దానితో ఆ ప్రచారాన్ని మరింత ఉధృతం చేసి కుప్పం నుంచి కూడా చంద్రబాబును వెళ్ళగొడతామంటూ వైసీపీ నాయకులు భీషణ ప్రతిజ్ఞతలు చేశారు .
"""/" /
అయితే వైసిపి( YCP ) చేస్తున్న ప్రచారం వల్ల తనకు రాజకీయం గా నష్టం జరుగుతుందని గ్రహించిన చంద్రబాబు రూట్ మార్చినట్లుగా తెలుస్తుంది .
ఆ విమర్శలకు చెక్ పెట్టాలని ఇకపై అలాంటి విమర్శలు రాకుండా జాగ్రత్త పడటంలో భాగంగా ఇప్పటికే అక్కడ 100 సెంట్లు భూమిని కొనుగోలు చేసిన చంద్రబాబు ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది .
ఇప్పుడు ఎట్టకేలకు అన్ని రకాల అనుమతులు మంజూరయ్యి ఇంటి నిర్మాణానికి సిద్ధంగా ఉన్నారట.
ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలల సమయం ఉంది కాబట్టి ఈలోపు ఇంటి నిర్మాణాన్ని పూర్తిచేసే కొత్త ఇంటిని భారీ స్థాయిలో పార్టీ అవసరాలకు ఉపయోగపడేలా నిర్మించుకోబోతున్నారని మెజారిటీ ప్రచారాన్ని కుప్పం నుంచే ప్లాన్ చేసుకునేలా కూడా చంద్రబాబు ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలుస్తుంది .
అయితే తమ రాజకీయ విమర్శలలో భాగంగా చంద్రబాబుపై వైసీపీ చేస్తున్న విమర్శలు చంద్రబాబు ఒక ఇంటివాడు కావడానికి దోహదం చేశాయని చెప్పవచ్చు.
ఆ సినిమా చేయనని డైరెక్టర్ కు షాకిచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం జరిగిందంటే?