రంగును వదలని వైకాపా… విమర్శలు మొదలు పెట్టిన టి‌డి‌పి

నిన్న వై‌ఎస్ జగన్ మోహన్ పుట్టిన రోజు కావున చాలా మంది వైసీపీ కార్యకర్తలు రక్తదాన కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ విషయంలో గుంటూరు కి చెందిన పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.కేంద్ర ప్రభుత్వం శక్తి పేరుతో ప్రతి మహిళా ఎస్‌ఐలకు కేటాయించిన స్కూటీలకు వైసీపీ స్టిక్కర్స్ అంటించి దిశ పేరుతో ఆ వెహికిల్స్ ను గుంటూరు అర్బన్ ఎస్‌ఐ అమ్మిరెడ్డి పోలీసు స్టేషన్ కార్యాలయంలో జెండా ఊపి ప్రారంబించాడు.

అయితే ఈ విషయంపై ఏపీ ప్రతి పక్ష పార్టీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

రంగుల విషయంలో వైసీపీకి హై కోర్టు, సుప్రీమ్ కోర్టు లో అక్షింతలు పడిన మరల అదే బుద్ది ప్రదర్శిస్తుందని విమర్శిస్తున్నారు.

"""/"/ గతంలో వైసీపీ ప్రభుత్వం.ప్రభుత్వ కార్యాలయాలకు, గ్రామ పంచాయతీ ఆఫీసులకు కూడా రంగులు వేసిన సంగతి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగా తెలుసు.

ఆ మధ్య దిశ పోలీసు స్టేషన్లకు వైసీపీ రంగులు వెయ్యడంతో కోర్టు ఆజ్ఞ మేరకే వెంటనే వాటిని తొలగించారు.

ఆన్లైన్ దిశ యాప్ కు కూడా వైసీపీ కలరే వేశారు.వైసీపీ పార్టీ రంగులకోసం కొన్ని కోట్లు ఖర్చు చేస్తుంది.

తాము ప్రవేశ పెట్టిన ఏ స్కీమ్ అయిన కానీ ఏ పని అయిన కానీ ప్రజల్లో తమ ఉనికిని కాపాడుకోవాలని వైసీపీ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు, కార్యకర్తలు అత్యుత్సాహం చూపించి జగన్ ను విమర్శలపాలు చేస్తున్నారు.

ఇలా జరగడం ఇప్పుడు కొత్తేమి కాదు.చివరికి గాందీ గారి సాయి బాబా విగ్రహాలకు కూడా వైసీపీ పార్టీ రంగులను వేశారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్ట్2, శుక్రవారం 2024