పత్తికొండలో వైఎస్ఆర్ రైతు భరోసా- పీఎం కిసాన్ కార్యక్రమం

కర్నూలు జిల్లా పత్తికొండలో వైఎస్ఆర్ రైతు భరోసా- పీఎం కిసాన్ కార్యక్రమం జరుగుతోంది.

ఈ క్రమంలో 52.30 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.

3,923.22 కోట్లను జమ చేయనున్నారు.

ఈ మేరకు తొలి విడతలో రూ.7,500 చొప్పున సీఎం జగన్ జమ చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని తెలిపారు.రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామన్న ఆయన వారు ఇబ్బంది పడొద్దనే పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే ఏడాదికి రూ.13,500 పెట్టుబడి సాయం అందిస్తున్నామని తెలిపారు.

రైతు భరోసా ద్వారా ఇప్పటివరకు రూ.31 వేల కోట్లు ఇచ్చామన్నారు.

ఏ సీజన్ లో పంట నష్టం జరిగితే అదే సీజన్ లో ఇన్ పుట్ సబ్సిడీ చెల్లిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే ఇన్ పుట్ సబ్సిడీ కోసం రూ.1965 కోట్లు చెల్లించామని చెప్పారు.

విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా ఉంటున్నామని వెల్లడించారు.

‘Modern Masters’ On Netflix Showcases The Extraordinary Journey Of S.S. Rajamouli: Watch It Now For These MOMENTS