ఘనంగా వైయస్సార్ జయంతి – నివాళులు అర్పించిన కాంగ్రెస్ శ్రేణులు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75 వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.

అనంతరం ఉమ్మడి జిల్లా మాజీ డిసిఎంఎస్ చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డి మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా నాలుగు సార్లు పార్లమెంటు సభ్యునిగా రెండుసార్లు పిసిసి అధ్యక్షునిగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం జరిగిందన్నారు పేద ప్రజల కోసం ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ , వృద్ధులకు పెన్షన్, ఆపదలో ఉన్న వారికి 108 అంబులెన్స్ సౌకర్యం కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.

ఇప్పటికీ పేద ప్రజల గుండెలలో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, మాజీ డిసిఎంఏస్ చైర్మన్ ముధుగంటి సురేందర్ రెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, మాజీ ఎంపీటీసీలు అప్పనపల్లి ఉపేందర్, ఉయ్యాల శ్రీనివాస్, నాయకులు బోయిని ఎల్లేష్ యాదవ్, నాగుల వంశి గౌడ్, నిమ్మ వినోద్ రెడ్డి, శాలివాహన శ్రీనివాస్, నల్లగొండ శ్రీనివాస్ గౌడ్,అహమ్మద్ , జంగ సత్యం,తిరుపతి రెడ్డి,డబ్బు వెంకట్ రెడ్డి,పొత్తూరి మహేందర్,ఏనుగుల ప్రశాంత్ , పిట్టల రమేష్ , దూస జనార్ధన్ , భాబు,పోలే కొమురయ్య , గంగిపల్లి లచ్చయ్య , రాజు తదితరులు ఉన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ తెలుగు భాషలో ఉండటం మన అదృష్టం.. జోష్ రవి కామెంట్స్ వైరల్!