మంగళగిరిలో లోకేష్ టార్గెట్ గా వైసిపి కీలక నేత ఎంట్రీ

వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ గెలవాలనే టార్గెట్ పెట్టుకున్న ఏపీ అధికార పార్టీ వైసీపీ.

దానికి అనుగుణంగానే రాజకీయ వ్యూహాలు అమలు చేస్తోంది.ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబును,  మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్( Nara Lokesh ) ను, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేసినా, అక్కడి నుంచే ఆయన్నూ ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

దీనికి అనుగుణంగానే వ్యూహాలు రచిస్తున్నారు.2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నారా లోకేష్ వైసీపీ అభ్యర్థి రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి చెందారు.

అయితే ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో పాటు, మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండడం తో వైసిపి అభ్యర్థి గంజి చిరంజీవి గెలుపునకు డోకా లేకుండా చేసేందుకు జగన్ పావులు కలుస్తున్నారు.

"""/" / దీనిలో భాగంగానే ఈ నియోజకవర్గంలో వైసిపికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడకుండా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓటమే ధ్యేయంగా వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి( Vijaysai Reddy )కి ఇక్కడ గెలుపు బాధ్యతలను జగన్ అప్పగించారట.

ఈ మేరకు ఎప్పటికప్పుడు తగిన వ్యూహాలు అందించడంతో పాటు, ఈ నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో పట్టు పెంచుకునే విధంగా విజయ సాయి రెడ్డిరంగంలోకి దిగబోతున్నారట.

"""/" / తన విమర్శలతో లోకేష్ ను ఇరుకున పెట్టి ,ఫలితం తమకు అనుకూలంగా ఉండేలా విజయసాయిరెడ్డి చేయగలరని జగన్ నమ్ముతున్నారు.

అందుకే ఆయనకు ఇక్కడ బాధ్యతలను ధ్యేయంగా పనిచేయాలని జగన్ సూచించారట .లోకేష్ తో పాటు ఆళ్ల రామకృష్ణారెడ్డి( Alla Ramakrishna Reddy ) కి చెక్ పెట్టే విధంగా , వైసిపి అభ్యర్థి గంజి చిరంజీవికి ( Ganji Chiranjeevi )భారీ మెజారిటీ దక్కే విధంగా చేసేందుకు జగన్ వ్యూహాత్మకంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ మేరకు .

విజయసాయి మంగళగిరి పై ప్రత్యేక దృష్టిపెడితే లోకేష్ కు ఇబ్బందికర పరిస్థుతలే ఏర్పడే అవకాశం లేకపోలేదు.

వైరల్ వీడియో: దేవుడా. రన్నింగ్ ట్రైన్‌పై ప్రయాణించిన వ్యక్తులు.. చివరకు.