జగన్ వీళ్లను పట్టించుకోవట్లేదా ?

ఏపీలో అధికార పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చక్రం తిప్పుతోంది.175 స్థానాలకు గాను 151 స్థానాల్లో వైసీపీ జెండా రెపరెపలాడించింది.

వైసీపీకి ఈ స్థాయిలో మైలేజ్ రావడానికి తెర వెనుక చాలామంది నాయకులు ప్రయత్నించారు.

వీరిలో జగన్ కు అత్యంత సన్నిహితులు కూడా ఉన్నారు.అయితే విధి విచిత్రమో ఏమో కానీ వీరిలో చాలామంది నాయకులు ఈ ఎన్నికల్లో ఓటమి చవి చూడాల్సి వచ్చింది.

వీరిలో జూనియర్ నాయకులు, కొత్తగా పార్టీలోకి వచ్చి పోటీలో నిలిచిన వారిని పక్కనపెడితే పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన వారిని జగన్ పట్టించుకోవడం లేదంటూ వీరంతా అసంతృప్తికి గురవుతున్నారట.

ఎన్నికల్లో ఓటమి చెందిన బాధ ఒకవైపు, జగన్ నిర్లక్ష్యం ఒకవైపు వీరిని కుంగతీస్తోందట.

ప్రస్తుతం వీరి రాజకీయ భవితవ్యం ఏంటనే ప్రశ్న తెరమీదికి వస్తోంది.పార్టీ అధికారంలో ఉన్నా తమకు సరైన పదవి లేకపోవడంతో వీరంతా బయటకి రాలేని పరిస్థితి నెలకొంది.

ఓటమి చవిచూసి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కుంటున్నవారిలో కీలక నేతల వివరాలు ఒకసారి పరిశీలిస్తే ప్రకాశం జిల్లా చీరాల నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఆమంచి కృష్ణమోహన్‌, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి ఓడిపోయిన తోట వాణి, అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి ఓడిపోయిన సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్‌రెడ్డి, చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై పోటీ చేసి ఓటమి పాలైన చంద్రమౌళి, ప్రకాశం జిల్లా పరుచూరులో ఓడి పోయిన దగ్గుపాటి వెంకటేశ్వరరావుల పరిస్థితిపై వైసీపీలో చర్చ సాగుతోంది.

వీరంతా రాజకీయంగా వైసీపీ లో సీనియర్లు.వీరికి సరైన ప్రాధాన్యం కల్పించి సముచిత స్థానం కల్పిస్తారా లేదా అనే చర్చ పార్టీలో ఇప్పుడు జోరుగా సాగుతోంది.

"""/"/  అయితే ఓడిపోయిన వారందరిని జగన్ పక్కనపెట్టేయ్యలేదు.వారిలో చాలామందికి ఇప్పటికే సముచిత స్థానం కల్పించారు.

వారిలో ప్రస్తుతం మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకట రమణారావు, పిల్లి సుభాష్ చంద్రబోస్ లకు జగన్ సముచిత స్థానం కల్పించారు.

వీరిని తన మంత్రి వర్గంలోకి తీసుకున్నారు.వీరికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.

బోస్ అప్పటికే ఎమ్మెల్సీ కావడం గమనార్హం.అదే సమయంలో విశాఖలో ఎన్నికలకు ముందు పార్టీలో చేరి పోటీ చేసి ఓడిపోయిన ద్రోణంరాజుకు కూడా విశాఖ అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ చైర్మన్ పదవిని జగన్ ఇచ్చారు.

కానీ అటువంటి పదవులు దక్కని నేతలు మాత్రం తమకు జగన్ ఎప్పుడు న్యాయం చేస్తాడో, అసలు పట్టించుకుంటాడా లేదో తెలియక సతమతం అయిపోతున్నారు.

జగన్ కనుక తమకు సరైన న్యాయం చేయకపోతే నియోజకవర్గంలో తలెత్తుకోలేమని, పార్టీలో ఉన్నా తమకు సరైన గుర్తింపు ఉండదని వీరంతా ఆందోళనలో ఉన్నారట.

ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్.. తుది శాతం ప్రకటించిన ఈసీ..!!