అసెంబ్లీ రీవ్యూ: ఎవరు గెలిచారు?
TeluguStop.com
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మంగళవారంతో ముగిశాయి.డిసెంబర్ 9న ప్రారంభమైన ఈ సమావేశాల్లో 16 బిల్స్ ఆమోదం పొందాయి.
ఇందులో ఏపీఎస్ ఆర్టీస్ విలీనం, దిశ చట్టం, ఎక్సైజ్ చట్ట సవరణలాంటి కీలకమైనవి కూడా ఉన్నాయి.
అయితే ఇలాంటి బిల్స్‌ను ఆమోదింపజేసుకొని తాము గెలిచామని ప్రభుత్వం సంబర పడుతుంది కానీ.
నిజంగా ఎవరు గెలిచారు.సమావేశాలు జరిగిన తీరు చూస్తే ఎవరు గెలిచారో ప్రజలే చెప్పగలరు.
ప్రతి విషయంలోనూ ప్రతిపక్ష నేత చంద్రబాబును లక్ష్యంగా చేసుకొని వైసీపీ చేసిన విమర్శలు కొన్నిసార్లు వాళ్లనే ఆత్మరక్షణలో పడేశాయి.
ముఖ్యంగా సన్న బియ్యం, ఇంగ్లిష్ మీడియం అంశాల్లో సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డే సమాధానం చెప్పలేక ఇబ్బంది పెట్టారు.
""img Src="https://telugustop!--com/wp-content/uploads/2019/12/ap-assembly-ysjagan-chandrababu-naidu-అసెంబ్లీ-రీవ్యూ!--jpg" /తన పత్రిక సాక్షిలో వచ్చిన కథనాలతోనే జగన్‌ను చంద్రబాబు ఇరుకున పెట్టడానికి ప్రయత్నించారు.
సాక్షిలో తప్పుగా రాశారని, మిగతా పత్రికలు చూస్తే ఆ విషయం తెలుస్తుందని జగనే సమాధానం చెప్పడం ఆశ్చర్యం కలిగించింది.
ఇంగ్లిష్ మీడియం విషయంలోనూ మరోసారి చంద్రబాబు సాక్షి ప్రస్తావన తీసుకురాగా.అసలు ఆ పత్రికతో తనకు సంబంధమే లేదని కూడా జగన్ చెప్పడం విశేషం.
ఇక అసెంబ్లీ చీఫ్ మార్షల్‌ను చంద్రబాబు ఏదో తిట్టారంటూ ఓ రోజు సభలో చర్చ నడిపించారు.
నిజానికి ఆయన అలా తిట్టలేదని వీడియోల్లో స్పష్టంగా తేలింది.కానీ ఆ పదాన్ని అసెంబ్లీలోనే జగన్ పదే పదే అనడంతో టీడీపీ ప్రివిలెజ్ నోటీస్ ఇవ్వాల్సి వచ్చింది.
ఈ సమావేశాల్లో దాదాపు ప్రతి చర్చ కూడా పక్కదారి పట్టిందని చెప్పొచ్చు.ప్రతి అంశంపైనా నిర్మాణాత్మక చర్చ జరిపితే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు.
కానీ చర్చ ఏదైనా చంద్రబాబునే లక్ష్యంగా చేసుకుంటూ విమర్శలు చేయడం అధికార పక్షానికి అలవాటుగా మారింది.
ఇవి చివరికి వాళ్లనే ఇరుకున పెట్టాయి.
తెలుగు డిజాస్టర్ సినిమాలతో వందల కోట్లు సంపాదిస్తున్న నిర్మాత.. ఏం జరిగిందంటే?