సుప్రీంలో వైఎస్ వివేకా హత్య కేసు విచారణ వాయిదా

మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ సుప్రీంకోర్టులో వాయిదా పడింది.

ఐదుగురు జడ్జీలు ఇవాళ అందుబాటులో లేరని సీజేఐ తెలిపింది.ఈ క్రమంలో విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

అయితే, కడప ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్టుపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధించింది ధర్మాసనం.

ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసు దర్యాప్తునకు సీబీఐకి ఇచ్చిన గడువును సుప్రీంకోర్టు పొడిగించే అవకాశం ఉంది.

కాగా ఈనెల 30తో గడువు ముగియనుండగా.కేసు దర్యాప్తు పురోగతిని సీబీఐ తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు వివరించనుంది.

ఈ క్రమంలో విచారణ వాయిదా పడటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

బుల్లితెరపై డిజాస్టర్ గా నిలిచిన కల్కి 2898 ఏడీ మూవీ.. రేటింగ్ తెలిస్తే షాకవ్వాల్సిందే!