నాంపల్లి సీబీఐ కోర్టులో వైఎస్ వివేకా హత్య కేసు విచారణ

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై హైదరాబాద్ లోని నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరుగుతుంది.

ఈ మేరకు ముగ్గురు నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరు పరిచారు.నిందితులు ఉమా శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ తో పాటు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచారు.

మరోవైపు హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి కూడా సీబీఐ కోర్టులో హాజరైయ్యారు.

అటు ఇదే కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై మధ్యాహ్నం తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.

గూగుల్ గొంతు మన కర్నూలు అమ్మాయిదే.. గ్రీష్మారెడ్డి గురించి ఈ షాకింగ్ విషయాలు తెలుసా?