వైఎస్ వివేకా హత్య కేసు విచారణ తెలంగాణకు బదిలీ

మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ తెలంగాణకు బదిలీ అయింది.ఈ కేసును ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలని వివేకా కుమార్తె సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై జరిపిన సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.

హైదరాబాద్ సీబీఐ స్పెషల్ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు జస్టిస్ ఎం.ఆర్.

షా, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం వెల్లడించింది.ఈ క్రమంలో కేసును తెలంగాణకు బదిలీ చేస్తూ న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.

హత్య కేసులో సాక్ష్యాధారాలు ధ్వంసం చేసినట్టు ఆధారాలున్నాయని తెలిపింది.విచారణపై వివేకా కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని పేర్కొంది.

వివేకా కుటుంబ సభ్యుల ప్రాథమిక హక్కులకు భంగం కలగకూడదని స్పష్టం చేసింది.

షాకింగ్ వీడియో: రష్యన్ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఇండియన్.. భర్త ఏం చేశాడంటే..?