వివేకానంద రెడ్డి కేసు వైసిపి కి చుట్టి ముంచనుందా ?

తెలుగుదేశం పార్టీకి ఓటుకు నోటు కేసు ఎంత నష్టం కలగజేసిందో మనందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసు వైసీపీకి పూర్తిస్థాయిలో నష్టం కలగజేసే అవకాశాలు కనిపిస్తునాయి .

ఎందుకంటే ఈ హత్య కేసు విచారణలో నోటీసులు అందుకున్న వాళ్ళందరూ జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితులు.

ఇప్పటివరకు వైఎస్ అవినాష్ రెడ్డి చుట్టూ తిరిగిన ఈ కేసు ఇప్పుడు ఆయన తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డి చుట్టూ తిరుగుతుంది ఇప్పటికే ఒకసారి సిబిఐ నోటీసులు అందుకున్న భాస్కర్ రెడ్డి ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల హాజరు కాలనీ సిబిఐకి సమాధానం ఇచ్చారు అయితే ఇప్పుడు సిబిఐ మరొకసారి ఆయనకు నోటీసులు అందజేసింది ఈ నెల 12వ తేదీన కడప సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్ లేదా సిబిఐ హైదరాబాద్ కార్యాలయంలో విచారణకు రావాలని సిఆర్పిసి 160 కింద నోటీసులు జారీ చేసింది.

"""/" / ఆంధ్రప్రదేశ్లో విచారణ జరిగినంత వరకు నత్తనడకన సాగింది అయితే ఆంధ్రప్రదేశ్లో విచారణ జరుగుతున్న విధానం పై తనకు నమ్మకం లేదని పోలీసులు సరిగ్గా సహకరించటం లేదని వైయస్ సునీత సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కు సిబిఐ కూడా మద్దతు పలకడంతో సుప్రీంకోర్టు విచారణను ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు మార్చింది .

"""/" / తెలంగాణకు మారిన తర్వాత విచారణ శరవేగంగా సాగుతుంది.ఒకపక్క విచారణ, ఒకపక్క దర్యాప్తుతో సిబిఐ ఈ కేసు లో వేగం పెంచింది.

ఈ కేసు ముందు ముందు ఏ రకంగా సాగుతుందో అన్న ఉత్కంఠ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది.

ఏది ఏమైనప్పటికీ ఇది రాజకీయంగా వైసీపీకి భారీనష్టమే కలగజేసే అవకాశం ఉన్నదని తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న మాట.

ధనుష్ రాజ్ కుమార్ పెరియాసామి డైరెక్షన్ లో చేస్తున్న సినిమా కథ ఇదేనా..?