తెలంగాణ హైకోర్టుకు వైఎస్ వివేకా కూతురు..!

తెలంగాణ హైకోర్టులో ఇవాళ కడప ఎంపీ అవినాశ్ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై విచారణ జరగనుంది.

ఈ నేపథ్యంలో వైఎస్ వివేకా కూతురు సునీత ఇప్పటికే కోర్టుకు చేరుకున్నారు.విచారణ సమయంలో ఆడియో, వీడియో రికార్డు చేసేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఎంపీ అవినాశ్ రెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు.

అయితే అవినాశ్ రెడ్డి పిటిషన్ లో తనను ఇంప్లీడ్ చేయాలని సునీత కోరనున్నారని తెలుస్తోంది.

అవినాశ్ రెడ్డి పిటిషన్ లో సునీతపై వ్యక్తిగత అంశాలు పేర్కొనడంపై తన వాదన వినాలని సునీత కోరే అవకాశం ఉందని సమాచారం.

కాగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా ప్రస్తుతం ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు మూడో సారి విచారిస్తున్నారు.