ఎమ్మెల్సీ కవిత దీక్షపై వైఎస్ షర్మిల సెటైర్లు
TeluguStop.com
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో చేయనున్న నిరాహార దీక్షపై వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల సెటైర్లు వేశారు.
ఇన్నేళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీకి కవితకు మహిళా రిజర్వేషన్లు ఇప్పుడు గుర్తుకు వచ్చాయా అని ప్రశ్నించారు.
ఎన్నడూ మహిళా సమస్యలపై స్పందించిన కవిత ఇప్పుడు నిరాహార దీక్ష చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని షర్మిల విమర్శించారు.
ఇదంతా బంగారం పోయిందని దొంగలే ధర్నా చేసినట్లుందని ఎద్దేవా చేశారు.లిక్కర్ స్కామ్ నిజాలు బయటపడతాయని కవిత భయపడుతున్నారన్నారు.
అందుకే మీడియాను తప్పుదోవ పట్టించేందుకు మహిళా రిజర్వేషన్లు అని డైవర్ట్ చేస్తున్నారని ఆరోపించారు.
బెల్లం, లవంగాలు కలిపి తీసుకుంటే ఏం అవుతుందో తెలుసా?