బండి సంజయ్, రేవంత్ రెడ్డికి వైఎస్ షర్మిల ఫోన్
TeluguStop.com
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఫోన్ చేశారు.
నిరుద్యోగుల విషయంలో కలిసి పోరాడదామని షర్మిల కోరినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేద్దామంటూ షర్మిల చెప్పారని సమాచారం.
అదేవిధంగా ప్రగతిభవన్ మార్చ్ పిలుపు ఇద్దామంటూ షర్మిల సూచించారు.ప్రతిపక్షాలు ఏకం అవుదామంటూ కోరారు.
అయితే నిరుద్యోగుల విషయంలో ఉమ్మడి పోరాటానికి బీజేపీ మద్ధతు ఉంటుందని బండి సంజయ్ తెలిపారని సమాచారం.
అటు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఏర్పడిందని వ్యాఖ్యనించారు.