బీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల విమర్శలు

బీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఎన్నికలు ఉంటేనే కేసీఆర్ బయటకు వస్తారని తెలిపారు.ఓట్ల కోసం కొత్త, పాత పథకాలకు తెర లేపుతున్నారని షర్మిల విమర్శించారు.

ఇళ్లకు డబ్బులు, పోడు పట్టాలు, బీసీలకు ఆర్థిక సాయం చేస్తారట అన్న ఆమె గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

పథకాల పేరుతో ప్రజలను వంచించేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు.ఈ సారి మళ్లీ కేసీఆర్ పథకాలను, మాటలను నమ్మితే మిగిలేది గుండు సున్నానే అంటూ షర్మిల వెల్లడించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి14, మంగళవారం2025