తెలంగాణ సీఎంకు వైఎస్ షర్మిల సవాల్
TeluguStop.com
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సవాల్ విసిరారు.
రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలపై చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు.తెలంగాణలో అసలు సమస్యలే లేవంటున్న కేసీఆర్ తనతో కలిసి మూడు రోజుల పాటు పాదయాత్ర చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామనే తమ పాదయాత్రను సర్కార్ అడ్డుకుందని ఆరోపించారు.ఈ క్రమంలోనే ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారని తెలిపారు.
రాష్ట్ర ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు.పిట్టల దొరలా టోపీ పెట్టుకుని విమానాల్లో తిరగడం కాదని, దమ్ముంటే తనతో పాదయాత్ర చేయాలని షర్మిల సవాల్ చేశారు.
ఇదేందయ్యా ఇది.. ‘కన్నప్ప’ లో ప్రభాస్ లుక్ ఇలా ఉంది!