రూ. వెయ్యి కోట్లు అడిగినట్లు నిరూపిస్తే రాజకీయాలు మానేస్తా.. వైఎస్ షర్మిల ఛాలెంజ్
TeluguStop.com
ఏపీలోని వైసీపీ నేతలపై పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila)తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఏపీ సీఎం జగన్(CM Jagan) ను తాను రూ.వెయ్యి కోట్లు అడిగినట్లు నిరూపిస్తే రాజకీయాలు మానేస్తానని ఛాలెంజ్ చేశారు.
వైసీపీ (YCP)నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు.జగన్ విసిరే బిస్కట్లకు అలవాటు పడి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అంతేకాకుండా జగన్(Jagan) పక్కన ఉండే వారంతా ఊసరవెళ్లులు అన్న షర్మిల వారు అవసరాలను బట్టి మనుషులను వాడుకుంటారని ఆరోపించారు.
ఈ క్రమంలోనే ఏపీలో అభివృద్ధి కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యమని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.
చైనా పరువు గంగపాలు.. ఈ వీడియో చూస్తే డ్రాగన్ కంట్రీపై అభిప్రాయం మారిపోతుంది!